Share News

Chandrababu Naidu: సుప్రీం ఉత్తర్వులు మా ముందు ఉంచండి

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:00 AM

ఇదే వ్యవహారంపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎ్‌సఎల్‌పీ) దాఖలైనట్లు తాము పత్రికల్లో చదివామని, సర్వోన్నత న్యాయస్థానం ఏమి ఉత్తర్వులు ఇచ్చిందని ఆరా తీసింది. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ..

Chandrababu Naidu: సుప్రీం ఉత్తర్వులు మా ముందు ఉంచండి

ఏజీకి హైకోర్టు ధర్మాసనం సూచన

చంద్రబాబుపై కేసుల విచారణ.. పిల్‌ వ్యవహారం

అమరావతి, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మరికొందరిపై నమోదైన కేసుల విచారణను సీబీఐ, ఈడీలకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిల్‌ బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ధర్మాసనం స్పందిస్తూ.. ఇదే వ్యవహారంపై సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎ్‌సఎల్‌పీ) దాఖలైనట్లు తాము పత్రికల్లో చదివామని, సర్వోన్నత న్యాయస్థానం ఏమి ఉత్తర్వులు ఇచ్చిందని ఆరా తీసింది. అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. ప్రస్తుత పిటిషనర్‌ కూడా ఆ ఎస్‌ఎల్‌పీలో జోక్యం చేసుకున్నట్లు వివరించారు. పిటిషనర్‌ ధర్మాసనం ముందు వాస్తవాలు చెప్పకపోవడం సరికాదన్నారు. ఎస్‌ఎల్‌పీలో ఇంటర్వీన్‌ అవుతూ పిటిషనర్‌ వేసిన అప్లికేషన్‌ వివరాలు కోర్టు ముందు ఉంచుతామన్నారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఎస్‌ఎల్‌పీలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను తమ ముందు ఉంచాలని ఏజీకి సూచిస్తూ, విచారణను రెండునెలలకు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన కౌంటర్‌ పై రిప్లై వేసేందుకు పిటిషనర్‌కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. విజయవాడకు చెందిన స్వర్ణాంధ్ర తెలుగు డైలీ ఎడిటర్‌ కె.బాలగంగాధర్‌ తిలక్‌ ఈ పిల్‌ దాఖలు చేశారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రాధాన్యత తెలియని వ్యక్తులు పాలన చేస్తే..

Also Read: తిరుపతిలో తొక్కిసలాటపై సీబీఐ విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Also Read: సీఎం సంచలన నిర్ణయం.. కమల్ హాసన్‌కి కీలక పదవి

Also Read: మరోసారి కుల గణన సర్వే

Also Read: చంద్రబాబుపై ఆ కేసు ఎందుకు పెట్టకూడదు

Also Read: బెజవాడలో భారీ అగ్నిప్రమాదం.. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 13 , 2025 | 05:37 AM