Share News

Operation Sindoor: రేపటి నుంచి తిరంగా ర్యాలీ

ABN , Publish Date - May 14 , 2025 | 05:20 AM

ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతం కావడంతో, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ నెల 15 నుండి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ తరఫున తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆయన ప్రధాని మోదీ నేతృత్వాన్ని ప్రశంసిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అవినీతి ప్రభావంలో ఉన్నదని పేర్కొన్నారు.

Operation Sindoor: రేపటి నుంచి తిరంగా ర్యాలీ

నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణ

బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతం అవడంతో ఈ నెల 15 నుంచి 18 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తరఫున తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘మన మహిళల సిందూరాన్ని చెరిపిన ఉగ్రవాదులను మన సైన్యం కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇలాంటి సమయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలే ఆయన్ను విశ్వగురుగా మార్చాయి. అధికారంలో ఉండగా మద్యం, ఇసుక, మైనింగ్‌... అన్నింట్లోనూ అవినీతికి పాల్పడిన వారు వరుసగా జైలుకు వెళుతున్నారు. కూటమి పాలనలో రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్‌ దిశగా పయనిస్తోంది. కేంద్రం నుంచి మోదీ సహకారంతో అభివృద్ధి పరుగులు పెడుతోంది’ అని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 05:20 AM