Share News

Nara lokesh : భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదు

ABN , Publish Date - Jan 31 , 2025 | 05:26 AM

ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో కొంతమంది గత వైసీపీ ప్రభుత్వ విధానాల నుంచి ఇంకా బయటకు రాలేదని, అలాంటి వారిపై

Nara lokesh : భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఉపేక్షించేది లేదు

శ్రీకాళహస్తి ఆలయ ఘటనపై విచారణ : మంత్రి లోకేశ్‌

అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో కొంతమంది గత వైసీపీ ప్రభుత్వ విధానాల నుంచి ఇంకా బయటకు రాలేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ హెచ్చరించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఏ చర్యను కూడా ఉపేక్షించేది లేదని ఆయన ఎక్స్‌ వేదికగా స్పష్టం చేశారు. శ్రీకాళహస్తి దేవాలయాల్లో క్యూలైన్లో ఉన్న భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపడంపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jan 31 , 2025 | 06:21 AM