Share News

Acharya Sudhakar: శతాధిక డిగ్రీల ఆచార్య సుధాకర్‌ కన్నుమూత

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:06 AM

వందకుపైగా డిగ్రీలతో గిన్నిస్‌ రికార్డు నెలకొల్పిన ఆచార్య డాక్టర్‌ పీజే సుధాకర్‌ 68 అనారోగ్యంతో బుధవారం

Acharya Sudhakar: శతాధిక డిగ్రీల ఆచార్య సుధాకర్‌ కన్నుమూత

  • 110 డిగ్రీలతో గిన్నిస్‌ రికార్డు

పెందుర్తి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): వందకుపైగా డిగ్రీలతో గిన్నిస్‌ రికార్డు నెలకొల్పిన ఆచార్య డాక్టర్‌ పీజే సుధాకర్‌ (68) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నం జిల్లా చినముషిడివాడలోని తన సోదరుడి ఇంటి వద్ద తుదిశ్వాస విడిచారు. పెందుర్తి మండలం పెదగాడిలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన సుధాకర్‌ విద్యావేత్తగా, పరిశోధకుడిగా వినుతికెక్కారు. కేంద్ర సమాచార ప్రసారాల అదనపు డైరెక్టర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. తన జీవితంలో సుధాకర్‌ 110 డిగ్రీలు, పదుల సంఖ్యలో పీజీలు పూర్తిచేశారు. పీహెచ్‌డీ కూడా చేశారు. శతాధిక డిగ్రీలు పూర్తిచేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కూడా సాధించారు. ఉద్యోగ విరమణానంతరం చినముషిడివాడలోని సోదరుడి వద్ద ఉంటున్నారు. ఆచార్య సుధాకర్‌ మృతి పట్ల స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - Aug 07 , 2025 | 05:06 AM