Organic Farming: రంగా వర్సిటీలో సర్టిఫికెట్ కోర్సులు
ABN , Publish Date - Jul 07 , 2025 | 03:38 AM
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్ కోర్సులకు ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ర్టార్ రామచంద్రరావు ఆదివారం ఓ ప్రకటనలో కోరారు.
అమరావతి, జూలై6 (ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సర్టిఫికెట్ కోర్సులకు ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని రిజిస్ర్టార్ రామచంద్రరావు ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోటలు, పుట్టగొడుగుల పెంపకంపై 8 వారాల పాటు ఆన్‌లైన్‌లో నిర్వహించే తరగతులకు హాజరయ్యే వారికి కంప్యూటర్/ ఆండ్రాయిడ్ సెల్ ఫోన్/ఐపాడ్ ఉండాలన్నారు. ఈ ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుల పూర్తి వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు.