ఆప్కా్‌సను రద్దు చేస్తారా?
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:22 AM
ఆంధ్రప్రదేశ కార్పొరేషన ఫర్ ఔట్ సోర్సింగ్‌ను రద్దు చేసి ఏజెన్సీల ద్వారా పాత విధానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏజెన్సీల పరిధిలోకి తీసుకు రావాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఏజెన్సీల ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి కసరత్తు
అయోమయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
ఆయా శాఖల నుంచే జీతాలు చెల్లింపులకు యూనియన్ల డిమాండ్
ఆలూరు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ కార్పొరేషన ఫర్ ఔట్ సోర్సింగ్‌ను రద్దు చేసి ఏజెన్సీల ద్వారా పాత విధానంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏజెన్సీల పరిధిలోకి తీసుకు రావాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్నున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సంఘాల రెండు రోజులుగా వాట్సాప్ గ్రూప్‌లో సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు.
ఫ పాత విధానం తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌లను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా చేపట్టేవారు. అయితే మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల అర్హులకు న్యాయం జరిగేది కాదు. అడ్డగోలుగా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులతో నియామకాలు జరిగేవి. దీంతో ఏజెన్సీలు సకాలంలో వేతనాలు చెల్లించక ఈపీఎఫ్ సక్రమంగా ఖాతాల్లో జమ చేయాక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరిగేది. రాజకీయ సిఫార్సులతో ఉద్యోగులను తొలగించిన సంఘటనలు ఉన్నాయి.
ఫ ఒకే గొడుగు క్రిందకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
గత ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ ఔట్ సోర్సింగ్ ఫర్ కార్పొరేషన (ఆప్కాస్) విధానాన్ని తీసుకొచ్చి ప్రతి నెల 1 నా వేతనాలు నేరుగా ఉద్యోగుల ఖాతాలో జమచేసి వేతనానికి ముందే ఈపీఎఫ్ కూడా సక్రమంగా జమ చేసే ప్రక్రియను శ్రీకారం చుట్టారు.
ఫ ఆప్కాస్ రద్దుతో ఉద్యోగుల్లో ఆందోళన
ఆప్కాస్ విధానం రద్దు చేస్తామని ప్రభుత్వ నిర్ణయంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఏళ్ల తరబడి ఉద్యోగాలు చేస్తున్న వారిలో సందిగ్ధం నెలకొంది. ఉద్యోగాలు ఉంటాయా ఊడుతాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 20 వేలకు పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.
ఫ కాంట్రాక్టు విధానమే ఉద్యోగులకు మేలు
ప్రభుత్వం ఆప్కా్‌సను రద్దు చేసినా అందులో ఉన్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టర్ పరిధిలోకి తీసుకువచ్చి నేరుగా ఆయా శాఖల హెచవోడీల ద్వారా జీతాలు చెల్లిస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుందని, ఉద్యోగ భద్రత కలుగుతుందని ఉద్యోగుల అభిప్రాయం. ఆ దిశగా ప్రభుత్వం పునరాలోచించాలని యూనియన నాయకులు కోరుతున్నారు.
ఫ కాంట్రాక్టు పరిధిలోకి తీసుకురావాలి - ముహమ్మద్ రఫీ, ఏపీ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకుడు
కూటమి ప్రభుత్వం ఆప్కా్‌సను రద్దుచేసి పాత విధానం ద్వారా ఏజెన్సీల ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇలా చేస్తే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో ఉద్యోగగ భద్రత పోతుంది. ఈపీఎఫ్ డబ్బులు గతంలో ఏజెన్సీలు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా దిగమింగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వం మరోసారి పునరాలోచించి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ పరిధిలోకి తీసుకువచ్చి నేరుగా ఆయా శాఖ అధిపతుల ద్వారా ప్రతినెల జీతాలు చెల్లించేలా చర్యలు చేపడితే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మేలు జరుగుతుంది
ఫ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం తగదు- రమే్‌షబాబు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి
ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడేందుకు అప్కా్‌సను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న రెండు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారన్నారు. సంస్థలకు వారిని అప్పజెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఉద్యోగ భద్రత కరువు అవుతుంది. ఓకవేళ ఆప్కాస్ విధానం రద్దు చేయాలనుకుంటే అందులో ఉన్న ఉద్యోగులందరినీ కాంట్రాక్ట్ పరిధిలోకి తీసుకురావాలి.