లూయి బ్రెయిలీకి ఘన నివాళి
ABN , Publish Date - Jan 04 , 2025 | 11:44 PM
అంధుల లిపి సృష్టికర్త లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా స్థానిక భవితకేంద్రంలో ఆయన చిత్ర పటానికి శనివారం పలువురు పూల మాలలు వేసి.. నివాళులర్పించారు.

నల్లచెరువు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): అంధుల లిపి సృష్టికర్త లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా స్థానిక భవితకేంద్రంలో ఆయన చిత్ర పటానికి శనివారం పలువురు పూల మాలలు వేసి.. నివాళులర్పించారు. ఉపాధ్యా యులు మాట్లాడుతూ... లూయి బ్రెయిలీ జీవిత చరిత్ర.. అంధుల లిపిని ఎలా కొనుగొన్నారు.. ఆ లిపి అంధుల జీవితాల్లో ఎలా వెలుగులు నింపుతోంది.. అన్న విషయాలను వివరించారు. మార్టిన అనే ఉపాధ్యాయుడు భవిత కేంద్రానికి క్యారంబోర్డు, మూడు మ్యాట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ తిరుపాల్‌నాయక్, ప్రత్యేక ఉపాధ్యాయులు నరసింహులు, గౌస్‌ఖాన, హెచఎం విజయలక్ష్మీ, పి.వినయ్, శ్రీనివాసులరెడ్డి, శివశంకర్, సంధ్య, రూపవతి, విద్యార్థులు, ఎమ్మార్సీ సిబ్బంది పాల్గొన్నారు.