రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:54 PM
మండల పరిధిలోని నన్నూరు విద్యుత కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపైన మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం శ్రీనగర్ కాలనీకి చెందిన పుల్లారెడ్డి కుమారుడు శంకర్ రెడ్డిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

ఓర్వకల్లు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని నన్నూరు విద్యుత కార్యాలయం సమీపంలో జాతీయ రహదారిపైన మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం శ్రీనగర్ కాలనీకి చెందిన పుల్లారెడ్డి కుమారుడు శంకర్ రెడ్డిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కొంత కాలంగా మండల పరిధిలోని కన్నమడకల గ్రామంలో నివసిస్తున్నాడని మృతుని తల్లి తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రామళ్లకోట సమీపంలో...
వెల్దుర్తి, వెల్దుర్తి టౌన, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): వెల్దుర్తి మండల పరిధిలోని రామళ్లకోట గ్రామ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనాథ్ (23) అనే యువకుడు మృతి చెందాడు. శ్రీనాథ్ రామళ్లకోట గ్రామానికి చెందిన గంజి బలరామ్ కుమారుడు. యువకుడు లారీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రామళ్లకోట గ్రామ సమీపంలో సిల్కాన ఇసుక లారీ బిల్లులను అందించి బైక్‌పై తిరిగి వస్తుండగా.. స్థానిక పెద్దమ్మ దేవాలయం వద్ద బొలేరో వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలు కాగా, స్థానికులు 108 వాహనంలో వెల్దుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి వివాహం కాలేదు.