Share News

AP EdCET: ఎడ్‌సెట్‌లో 99.42ు ఉత్తీర్ణత

ABN , Publish Date - Jun 21 , 2025 | 03:33 AM

బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌- 2025లో 99.42శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

AP EdCET: ఎడ్‌సెట్‌లో 99.42ు ఉత్తీర్ణత

  • ఫలితాలు విడుదల చేసిన ఏఎన్‌యూ ఇన్‌చార్జి వీసీ

పెదకాకాని, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌- 2025లో 99.42శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎడ్‌సెట్‌ చైర్మన్‌, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె. గంగాధర్‌రావు శుక్రవారం ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షకు 17,795 మంది దరఖాస్తు చేసుకోగా, 14,612 మంది హాజరయ్యారని, వీరిలో 14,527 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాలు, ర్యాంక్‌ కార్డులను వెబ్‌సైట్‌ cets.apsche.ap.gov.in నుంచిపొందవచ్చని ఎడ్‌సెట్‌ కన్వీనర్‌ ఆచార్య ఏవీవీఎస్‌ స్వామి తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్‌ ఆచార్య కె. రత్నషీలామణి, రిజిస్ర్టార్‌ ఆచార్య జి.సింహాచలం, ఆచార్య తులసీదాస్‌, డాక్టర్‌ సుభాషిణి, డాక్టర్‌ కె. శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు.


ర్యాంకర్లు వీరే...

ఎడ్‌సెట్‌లో రాష్ట్రస్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన అభ్యర్థుల వివరాలు..

ఇంగ్లిష్‌: పి.ప్రశాంతం, డి.శ్రీహిత, వి.అఖిల

మ్యాథమెటిక్స్‌: ఎం.నవీన్‌కుమార్‌, పి.సాయివందన, ఎస్‌.కోమలిక

బయాలజీ: కె.వెంకట కుసుమాంజలి, ఎం చాందిని, డి.కృష్ణ

ఫిజికల్‌ సైన్సెస్‌: పి.మణికంఠ, వి.లక్ష్మీకామేశ్వరి, ఎం.మహేశ్వరి

సోషల్‌: సయ్యద్‌ హబీబున్నిసా, పి.జగదీశ్వరరావు, సిహెచ్‌. లోకేశ్‌

Updated Date - Jun 21 , 2025 | 06:41 AM