Share News

945 ఎకరాలను 18 ఏళ్లుగా వదిలేశారు

ABN , Publish Date - Feb 26 , 2025 | 01:25 AM

పరిశ్రమల ఏర్పాటు కోసం వందల ఎకరాల భూములు కేటాయించి దశాబ్దంన్నర గడుస్తున్నా ఒక్క పరిశ్రమ కార్యరూపం దాల్చలేదు. బఫెలో బ్రీడింగ్‌ సెంటర్‌(పశుగణ ఉప్పత్తి కేంద్రం), తోళ్ల పరిశ్రమ, మామిడి పరిశోధనా కేంద్రం.. ఇలా ఎన్నో ప్రతిపాదనలు చేసినా నేటికీ ఆ దిశగా ఒక్క అడుగు పడలేదు. రోజురోజుకూ విలువ పెరగడంతో ఆ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. ఆక్రమిం చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకొంత కాలం ఇలాగే వదిలేస్తే ఈ భూములు కబ్జా రాయుళ్ల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి వెంటనే ఇండస్ర్టియల్‌ పార్క్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

945 ఎకరాలను 18 ఏళ్లుగా వదిలేశారు

-చిట్యాలలో పశుగణాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు భూముల కేటాయింపు

-బఫెలో బ్రీడింగ్‌ సెంటర్‌, తోళ్ల పరిశ్రమ, మామిడి పరిశోధనా కేంద్రం ఇలా ఎన్నో ప్రతిపాదనలు

- ఏ ఒక్కటి ఏర్పాటు చేయకపోవడంతో నిరుపయోగంగా భూములు

- ఆక్రమించుకునేందుకు సిద్ధమవుతున్న కబ్జాదారులు

- ఎంఎస్‌ఎంఈ ఇండస్ర్టియల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలని ప్రజల విజ్ఞప్తి

పరిశ్రమల ఏర్పాటు కోసం వందల ఎకరాల భూములు కేటాయించి దశాబ్దంన్నర గడుస్తున్నా ఒక్క పరిశ్రమ కార్యరూపం దాల్చలేదు. బఫెలో బ్రీడింగ్‌ సెంటర్‌(పశుగణ ఉప్పత్తి కేంద్రం), తోళ్ల పరిశ్రమ, మామిడి పరిశోధనా కేంద్రం.. ఇలా ఎన్నో ప్రతిపాదనలు చేసినా నేటికీ ఆ దిశగా ఒక్క అడుగు పడలేదు. రోజురోజుకూ విలువ పెరగడంతో ఆ భూములపై అక్రమార్కుల కన్ను పడింది. ఆక్రమిం చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకొంత కాలం ఇలాగే వదిలేస్తే ఈ భూములు కబ్జా రాయుళ్ల చేతుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించి వెంటనే ఇండస్ర్టియల్‌ పార్క్‌ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

(ఆంధ్రజ్యోతి-తిరువూరు):

మెట్ట ప్రాంతమైన తిరువూరు నియోజకవర్గంలో ఎక్కువశాతం మంది వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. తిరువూరు, విస్సన్నపేట మండలాల్లో వరిసాగు, గంపలగూడెం, ఏ కొండూరు మండలాల్లో పత్తి, మిర్చి సాగు అధికంగా ఉంది. చదువుకున్న యువత సరైన ఉపాధి అవకాశాలు లేక పోవడంతో సీజన్‌ను బట్టి మిర్చి, మామిడి తోటల్లో పనులకు వెళ్తున్నారు. మరి కొందరు ఉపాధి కోసం హైదరాబాద్‌, ముంబై వంటి దూరప్రాంతాలకు వెళ్తున్నారు. ఇక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 18 ఏళ్ల కిందట పరిశ్రమల ఏర్పాటు కోసం వందలాది ఎకరాలను కేటాయించారు. ఒక్క పరిశ్రమ కూడా స్థాపించకపోవడంతో ఆ భూములు నిరుపయోగంగా మారాయి.

2007లో భూముల కేటాయింపు

తిరువూరు మండలంలో పశుగణాభివృద్ది కేంద్రం ఏర్పాటు నిమిత్తం తిరువూరు విజయవాడ ప్రదాన రహదారిలో సుమారు 945 ఎకరాల భూమిని పశుసంవర్థకశాఖకు కేటాయించారు. చిట్యాల రెవెన్యూలో(అప్పటి సర్వే ప్రకారం) ఆర్‌ఎస్‌ నెం.211లో 504 ఎకరాలు, ఆంజనేయపురం రెవెన్యూలో ఆర్‌ఎస్‌నెం.124లో 126 ఎకరాలు, ఆర్‌ఎస్‌నెం.123/3లో 2 ఎకరాలు, 106లో 13 ఎకరాలు, రామన్నపాలెం రెవెన్యూలో ఆర్‌ఎస్‌నెం.230లో 172.77ఎకరాలు, ఆర్‌ఎస్‌నెం.229లో 8.16 ఎకరాలు, ఆర్‌ఎస్‌నెం.223లో 38.20 ఎకరాలు, ఆర్‌ఎస్‌నెం.22లో 10 ఎకరాలు, ఆర్‌ఎస్‌నెం.23/1లో 11.36 ఎకరాలు, ఆర్‌ఎస్‌నెం.23/2లో 2.93 ఎకరాలు, ఆర్‌ఎస్‌నెం.7/1లో 17.46 ఎకరాలు, ఆర్‌ఎస్‌నెం.7/2లో 9.12 ఎకరాలు, మొత్తం 945 ఎకరాల భూమిని 2007లో బఫెల్లో బ్రీడింగ్‌ సెంటర్‌ నిర్మాణం కోసం పశుసంవర్థకశాఖకు సుమారు 18 సంవత్సరాల కిందట అప్పటి కలెక్టర్‌ భట్టాచార్య కేటాయించారు. తొలుత ఈ భూమిలో పశువుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ట్యాంక్‌ నిర్మించిన తదుపరి ఈ పఽథకం వేరే ప్రాంతానికి తరలివెళ్లిపోవడంతో ఈ ప్రాంతాన్ని నిరుపయోగంగా వదిలివేశారు. గతంలో నిర్మించిన ట్యాంక్‌ సైతం తొలగించారు. అప్పటి ఉపముఖ్యమంత్రి కోనేరు రంగారావు ఈ స్థలంలో మామిడి పరిశోధన కేంద్రం కోసం ప్రతిపాదన చేయగా.. ఇది నూజివీడుకు తరలింది. తోళ్ల పరిశ్రమ సైతం మరో ప్రాంతానికి వెళ్లిపోవడంతో నిరుపయోగంగా ఉన్న ఈ భూమిపై కొందరు పెద్దలు కన్నేశారు. ఈ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Feb 26 , 2025 | 01:25 AM