Share News

Nara Lokesh: 91 పెద్ద కంపెనీలు వస్తున్నాయ్‌

ABN , Publish Date - May 14 , 2025 | 04:01 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ₹91,839 కోట్ల పెట్టుబడులతో 91 కంపెనీలు 1.4 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌, బ్లాక్‌చెయిన్‌, స్కిల్‌ పోర్టల్‌ వంటి టెక్నాలజీల ద్వారా సేవల విస్తరణతో పాటు, ఐటీ - ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Nara Lokesh: 91 పెద్ద కంపెనీలు వస్తున్నాయ్‌

ప్రతి కంపెనీకి ఓ నోడల్‌ అధికారి

యూనిట్లు వేగంగా స్థాపించేలా చూడాలి

ఐదేళ్లలో ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ రంగాల్లో

5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం

నెలాఖరుకు వాట్సా్‌పలో 400 సేవలు

ఆర్‌టీజీఎ్‌సపై సమీక్షలో మంత్రి లోకేశ్‌

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. మంగళవారం ఉండవల్లి నివాసంలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్‌టీజీఎ్‌స)పై సమీక్ష నిర్వహించారు. ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ రంగాల్లో ఆ కంపెనీలు రూ.91,839 కోట్ల పెట్టుబడులు పెట్టి, 1,41,407 ఉద్యోగాలను కల్పించేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ కంపెనీల పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై మంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఈ కంపెనీలన్నింటికీ త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని ఐటీ శాఖను ఆదేశించారు. ప్రతిపెద్ద కంపెనీకి ఒక నోడల్‌ అధికారిని నియమించాలని, యూనిట్లు వేగవంతంగా స్థాపించేలా యంత్రాంగం చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ రంగాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ ఉద్యోగులు కీలక భూమిక వహిస్తారని చెప్పారు. ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాలను తక్షణమే ఇవ్వాలన్నారు. అలాగే రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. విశాఖ నగరాన్ని ఐటీ హబ్‌గా వేగంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.


వాట్సాప్‌ ద్వారా మరిన్ని సేవలు

ప్రభుత్వానికి సంబంధించి పౌర సేవలన్నీ వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా అందుబాటులో ఉంచాలని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం 317 రకాల సేవలు మనమిత్ర వాట్సా్‌పలో అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిని నెలాఖరుకు 400కు విస్తరించాలని ఆర్‌టీజీఎస్‌ అధికారులను ఆదేశించారు. రెవెన్యూతో సహా పలు ప్రభుత్వ సేవలన్నింటినీ వాట్సాప్‌ ద్వారా అందించాలన్నారు. ప్రతి సర్టిఫికెట్‌ బ్లాక్‌చెయిన్‌, క్యూఆర్‌ కోడ్‌తో నిర్ధారించుకునేలా టెక్నాలజీని అనుసంధానం చేయాలన్నారు. ప్రభుత్వ శాఖల ఉత్తర్వులన్నీ ఒకే వేదికపైకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులను రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌, మునిసిపాలిటీలు, పంచాయతీల్లో పన్నుల బకాయిలకు సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్‌ సందేశాలు పంపాలన్నారు. వచ్చేనెల 9, 10 తేదీల్లో విశాఖలో జరగనున్న ఈ-గవర్నెన్స్‌ జాతీయ సదస్సుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని లోకేశ్‌ ఆదేశించారు.

5.jpg

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సను మరింత సరళతరం చేయాలన్నారు. చిరువ్యాపారులు, చిన్నతరహా పరిశ్రమలకు సింగిల్‌ సర్టిఫికేషన్‌ జారీ చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం క్యూఆర్‌ కోడ్‌, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ సహకారం తీసుకోవాలన్నారు. సమావేశంలో ఐటీశాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌, స్పెషల్‌ సెక్రటరీ సుందర్‌ తదితరులు పాల్గొన్నారు.


ఉద్యోగాల కల్పనకు యాక్షన్‌ ప్లాన్‌

నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లాలవారీగా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఇంటర్‌, వృత్తి విద్యలను బలోపేతం చేయాలన్నారు. తద్వారా ఐదేళ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం నైపుణ్యాభివృద్ధిశాఖ అధికారులతో మంత్రి లోకేశ్‌ సమీక్ష నిర్వహించారు. నైపుణ్యం పోర్టల్‌ను సింగిల్‌ ప్లాట్‌ ఫామ్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. నైపుణ్య శిక్షణ పొందిన యువతను పరిశ్రమలతో అనుసంధానం చేయడం ద్వారా ఉద్యోగాల కల్పనను ట్రాక్‌ చేయాలన్నారు. విదేశాల్లో ఉద్యోగావకాశాల గురించి ఓంక్యాప్‌ ద్వారా అవగాహన కల్పించాలని చెప్పారు.


అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

పరిశ్రమలశాఖ జీఎంలతో భేటీలో మంత్రి భరత్‌

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధిలో అధికారులు కూడా పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల మంత్రి టీజీ భరత్‌ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. మంగళవారం ఆయన పరిశ్రమలశాఖ అన్ని జిల్లాల జీఎంలతో మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని పెండింగ్‌ ప్రాజెక్టులు, పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలకు అనుమతుల వివరాలపై ఆరాతీశారు. సీఎం అధ్యక్షతన నిర్వహించిన ఐదు ఎస్‌ఐపీబీ సమావేశాల్లో ఆమోదించిన పెట్టుబడులకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. పరిశ్రమలకు అనుమతుల్లో ఎలాంటి సమస్యలు ఉండకూడదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 04:01 AM