Share News

Student Idea : ఎడ్లబండికి సోలార్‌ పవర్‌..!

ABN , Publish Date - Mar 07 , 2025 | 07:10 AM

గ్రామీణ జీవనశైలిని ఆధునీకరించే ఉద్దేశంతో ఎడ్లబండికి ప్రత్యామ్నాయంగా సౌరశక్తితో నడిచే విద్యుత్‌ వాహనాన్ని(ఈవీ) తయారు చేయాలన్న ఆరో తరగతి విద్యార్థి ఆలోచనకు

Student Idea : ఎడ్లబండికి సోలార్‌ పవర్‌..!

  • ఆరో తరగతి విద్యార్థి ప్రతిపాదన

  • ‘ఇన్‌స్పైర్‌ మనాక్‌’ ఆర్థిక సాయం

వేలేరుపాడు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): గ్రామీణ జీవనశైలిని ఆధునీకరించే ఉద్దేశంతో ఎడ్లబండికి ప్రత్యామ్నాయంగా సౌరశక్తితో నడిచే విద్యుత్‌ వాహనాన్ని(ఈవీ) తయారు చేయాలన్న ఆరో తరగతి విద్యార్థి ఆలోచనకు ఇన్‌స్పైర్‌ మనాక్‌ సంస్థ ఫిదా అయింది. ఎడ్లబండికి సోలార్‌ పవర్‌తో నడిచే మోటార్‌ను అమర్చడం ద్వారా ఎద్దులపై భారం తగ్గించొచ్చన్న ప్రతిపాదన నచ్చడంతో ఆ విద్యార్థికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించి నమూనా (ప్రొటోటైప్‌) తయారు చేయాలని కోరింది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం భూదేవిపేట ఎంపీ, యూపీఎస్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న కె లక్ష్మీనరసింహ తన టీచర్‌ ఎం.యువరత్న కిశోర్‌ నాయక్‌ మార్గనిర్దేశంలో ఈవీ ఎడ్లబండి ప్రతిపాదనను పంపాడు.

Updated Date - Mar 07 , 2025 | 07:10 AM