Share News

8 నుంచి వీరమ్మ తిరునాళ్ల

ABN , Publish Date - Feb 03 , 2025 | 01:09 AM

ఉయ్యూరులో వీరమ్మ తిరునాళ్ల ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న వీరమ్మ తిరునాళ్ల ఏటా భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై 15 రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. తిరునాళ్లకు రెండు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకుంటారు.

8 నుంచి వీరమ్మ తిరునాళ్ల

- 15 రోజుల పాటు నిర్వహణ

- చురుగ్గా జరుగుతున్న ఏర్పాట్లు

- తెలుగు రాషా్ట్రల నుంచి తరలిరానున్న భక్తులు

ఉయ్యూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) :

ఉయ్యూరులో వీరమ్మ తిరునాళ్ల ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న వీరమ్మ తిరునాళ్ల ఏటా భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై 15 రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. తిరునాళ్లకు రెండు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. రావిచెట్టు సెంటర్‌ సమీపాన మెట్టినింటి నుంచి శనివారం రాత్రి బయలుదేరిన అమ్మవారు వేలాది మంది భక్తుల ఎదురుగండ దీపాలు అందుకుంటూ తిరుగు గండ దీపాల భక్తులు వెంటరాగా ఊరంతా ఊరేగి ఆదివారం సాయంత్రం ప్రధాన సెంటర్‌ సమీపాన ఉన్న ఊయల స్తంభాల వద్ద ఊయలలూగి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆలయానికి చేరుకుని తిరునాళ్లకు వచ్చే భక్తులకు దర్శనమిస్తారు. పదిహేను రోజులపాటు వైభవంగా జరిగే తిరునాళ్లకు పెద్దయెత్తున భక్తులు తరలిరానున్నారు. ఈ మేరకు అధికారులు, ఆలయ కమిటీ తగు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Feb 03 , 2025 | 01:09 AM