Education Reforms: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు 78 మంది
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:27 AM
రాష్ట్రవ్యాప్తంగా 78 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా పాఠశాల విద్యాశాఖ గుర్తించింది..
అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 78 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికైన టీచర్ల జాబితాలను బుధవారం విడుదల చేసింది. రాష్ట్ర అవార్డులకు ఎంపికైన టీచర్లను శుక్రవారం విజయవాడలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవంలో పాల్గొనేందుకు రిలీవ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు ఆదేశాలు జారీచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తమ టీచర్లకు అవార్డులు అందజేస్తారు. ఉత్తమ టీచర్లకు మెడల్, ప్రశంసా పత్రం, రూ.20వేల నగదు అందజేస్తారు.