Share News

Sukanta Majumdar: ఏపీలోని 2 కేంద్ర వర్సిటీలకు ఐదేళ్లలో 529 కోట్లు

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:59 AM

గత ఐదేళ్లలో ఏపీలోని రెండు కేంద్ర విశ్వవిద్యాలయాలకు రూ.529.14 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర విద్యా శాఖ స

Sukanta Majumdar: ఏపీలోని 2 కేంద్ర వర్సిటీలకు ఐదేళ్లలో 529 కోట్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో ఏపీలోని రెండు కేంద్ర విశ్వవిద్యాలయాలకు రూ.529.14 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్‌ వెల్లడించారు. ఏపీలోని సెంట్రల్‌ యూనివర్సిటీకి 2020-21 నుంచి 2024-25 వరకు రూ.404.05 కోట్లు విడుదల చేయగా, గిరిజన విశ్వవిద్యాలయానికి గత ఐదేళ్లలో రూ.125.09 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. సోమవారం లోక్‌సభలో ఎంపీ చిన్ని అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.

‘ఉద్యోగులకు’ 24% హెచ్‌ఆర్‌ఏ కొనసాగింపు

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయ ఉద్యోగులకు ప్రస్తుతం అమలుచేస్తున్న 24 శాతం హెచ్‌ఆర్‌ఏను మరో ఏడాదిపాటు కొనసాగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - Aug 05 , 2025 | 05:59 AM