Share News

3వ శనివారం స్వచ్ఛత దినంగా పాటించాలి

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:04 AM

రాష్ట్రంలో ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛత దినంగా పాటించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ కలెక్టర్లను ఆదేశించారు.

3వ శనివారం స్వచ్ఛత దినంగా పాటించాలి

కర్నూలు కలెక్టరేట్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛత దినంగా పాటించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మూడో శనివారం అనగా ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో అ న్ని ప్రాంతాల్లోని గ్రామాలు, పాఠశాలు, కళాశాలలో స్వచ్ఛత దినంగా పాటించాలని అన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ కార్పొరేషన జారీ చేసే మార్గదర్శకాల మేరకు స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజాప్రతినిధులను స్వచ్ఛత కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి ర్యాలీలు, మానవహారాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ స్పందిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరించేలా చర్యలు తీసుకుంటామని, చెట్ల పొదలు నిర్మూలన, ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల శుభ్రత మొదలైన కార్యక్రమాలు చేపడుతామని ప్రధాన కార్యదర్శికి వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్సకు అసిస్టెంట్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రబాబు, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్‌ హాజరయ్యారు.

Updated Date - Jan 17 , 2025 | 12:04 AM