Former MLA Prasanna Kumar Reddy: 3 గంటలు.. 40 ప్రశ్నలు
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:54 AM
టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు.
ఎమ్మెల్యే ప్రశాంతిపై వ్యాఖ్యల కేసులో ప్రసన్నను విచారించిన పోలీసులు
అన్నిటికీ రాతపూర్వక సమాధానాలు
నేడు విచారణకు మాజీ మంత్రి అనిల్?
నెల్లూరు (క్రైం), జూలై 25(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. శుక్రవారం నెల్లూరులోని రూరల్ డీఎస్పీ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి వచ్చారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆయన్ను విచారించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విచారణ సాగింది. డీఎస్పీ 40 ప్రశ్నలు సంధించారు. అన్నిటికీ ఆయన రాతపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. అనంతరం బయటకు వచ్చిన ప్రసన్న మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, వీటిపై కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులు, జైళ్లు పట్టవన్నారు. కోవూరు సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో పాటు మరో నలుగురు నవ్వారని కేసులు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఐదుగురు కూడా విచారణకు హాజరవుతారన్నారు. తమకు రెడ్‌బుక్ అవసరం లేదని, బ్రెయిన్‌లోనే కంప్యూటర్ ఉందని, ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్న వారందరినీ గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. కాగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను శనివారం పోలీసులు విచారించనున్నారు. రుస్తుం మైన్స్ కేసులో అనిల్ ప్రమేయం ఉందంటూ బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఆయన ప్రధాన అనుచరులు రాష్ట్రం విడిచి వెళ్లారన్న ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో విచారణకు అనిల్ హాజరవుతారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఇవి కూడా చదవండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News