200 Special Buses: సత్యసాయి శత జయంతికి 200 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ఎండీ
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:17 AM
పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ ఆర్టీసీ 200 ప్రత్యేక బస్సులు నడుపుతుందని ఆ సంస్థ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు.
పుట్టపర్తి టౌన్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ ఆర్టీసీ 200 ప్రత్యేక బస్సులు నడుపుతుందని ఆ సంస్థ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి మంగళవారం వచ్చిన ఆయన, ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రతినిధులతో శత జయంతి ఏర్పాట్ల గురించి చర్చించారు. పుట్టపర్తి ఆర్టీసీ డిపో, బస్టాండును అధికారులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. సత్యసాయి శత జయంతికి పుట్టపర్తికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.