స్వచ్ఛాంధ్రలో వెనుకబాటు
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:46 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర ర్యాంకుల్లో జిల్లా 15వ స్థానంతో సరిపెట్టుకుంది. పరిశుభ్రత, స్వచ్ఛమైన గాలి, నీరు, ప్లాస్టిక్ నివారణ వంటి 14 అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని అమలు చేస్తున్న కార్యాచరణ ఆధా రంగా వచ్చిన పాయింట్ల ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు లభించాయి.

15వ స్థానంలో నిలిచిన ఏలూరు జిల్లా
ఏలూరు సిటీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర ర్యాంకుల్లో జిల్లా 15వ స్థానంతో సరిపెట్టుకుంది. పరిశుభ్రత, స్వచ్ఛమైన గాలి, నీరు, ప్లాస్టిక్ నివారణ వంటి 14 అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని అమలు చేస్తున్న కార్యాచరణ ఆధా రంగా వచ్చిన పాయింట్ల ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు లభించాయి. స్వచ్ఛాంరఽధ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి చంద్ర బాబు శుక్రవారం నిర్వహించిన సమీక్షలో స్వచ్ఛాంధ్రలో లభించిన మార్కుల ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు ప్రకటిం చారు. మొత్తం 200 పాయింట్ల ఆధారంగా జిల్లాల ప్రోగ్రెస్‌పై ర్యాంకులు ఇవ్వగా ఏలూరు జిల్లా 108 పాయింట్లు సాధించి రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్లు, డోర్ టూ డోర్ కలెక్షన్, సాలిడ్ వేస్ట్ శాగ్రిగేషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, కమ్యూనిటీ సోక్‌పిట్స్, క్లీన్‌విలేజ్, ఒడిఎఫ్ ప్లస్ మోడల్ విలేజ్ వంటి అంశాల్లో ఆయా జిల్లాల్లో ప్రగతిని పరిగణలోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి నెల ఒక థీమ్ తీసుకుని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి శనివారం నిర్వహిస్తున్నారు. జనవరిలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ అనే అంశాన్ని థీమ్‌గా తీసుకున్నారు.