Share News

25 Lakh Gold Ornament Offered: టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం

ABN , Publish Date - Aug 14 , 2025 | 05:25 AM

టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు బుధవారం రూ.కోటి విరాళంగా అందింది. బెంగుళూరుకు చెందిన కల్యాణ్‌ కృష్ణమూర్తి అనే భక్తుడు..

25 Lakh Gold Ornament Offered: టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళం

తిరుమల, ఆగస్టు13(ఆంధ్రజ్యోతి): టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు బుధవారం రూ.కోటి విరాళంగా అందింది. బెంగుళూరుకు చెందిన కల్యాణ్‌ కృష్ణమూర్తి అనే భక్తుడు విరాళం చెక్‌ను తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.భోగ శ్రీనివాసమూర్తికి అలంకరించేందుకు వజ్రం, వైజయంతి పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పతకాన్ని బెంగుళూరుకు చెందిన కేఎం శ్రీనివాసమూర్తి అందజేశారు. దీని విలువ రూ.25 లక్షలు.

19 నుంచి అమరావతిలో పవిత్రోత్సవాలు

అమరావతిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 19 నుంచి 21వ తేదీ వరకు పవిత్రోత్సవాలను టీటీడీ నిర్వహించనుంది. 18 సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలు మొదలవుతాయి.

Updated Date - Aug 14 , 2025 | 05:25 AM