Field Visit : పోలవరం ముంపుపై ఎన్‌డీఎంఏ సభ్యుల పరిశీలన
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:24 AM
గోదావరి వరద ముంపు, పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపును అంచనా వేయడానికి జాతీయ విపత్తుల నివారణ సంస్థ సభ్యులు ఢిల్లీ నుంచి వచ్చారు. గురువారం ఆ సభ్యులు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ బృందంలో సీనియర్ కన్సల్‌టెంట్

వేలేరుపాడు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద ముంపు, పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపును అంచనా వేయడానికి జాతీయ విపత్తుల నివారణ సంస్థ సభ్యులు ఢిల్లీ నుంచి వచ్చారు. గురువారం ఆ సభ్యులు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ బృందంలో సీనియర్ కన్సల్‌టెంట్ (సీఐఐ) డాక్టర్ స్వాతి సులగ్న, డిప్యూటీ డైరెక్టర్ సీఐఐ అయినపర్తి జెస్సీ ఆనంద్, మరో ఇద్దరు సభ్యులు ఉన్నారు. మండలంలోని రుద్రమ్మకోట, రేపాక గొమ్ము, తాటుకూరుగొమ్ము గ్రామాల్లో పర్యటించి 2022లో వరదలు ఎంత మేరకు వచ్చాయి? ప్రజలు ఎక్కడ రక్షణ పొందారు? తదితర అంశాలను గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జనసేన మండల అధ్యక్షుడు ఆదినారాయణ, టీడీపీ నేతలు యాళ్ళ శంకర్, గుడిపిటి సురేష్, బీజేపీ మండల అధ్యక్షుడు నరసింహరావు పాల్గొన్నారు.