టాలీవుడ్‌పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Dec 28 , 2024 | 02:26 PM
మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తెలుగు సినిమా ఇండ్రస్ట్రీని తెచ్చేందుకు 40 ఏళ్లు పట్టిందని ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఏపీకి వెళ్లాలనుకునే వారు వెళ్లొచ్చంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (Telugu Film Industry) రావాలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై చిత్ర పరిశ్రమలో పెద్దఎత్తున చర్చ మెుదలైంది. అయితే ఈ అంశంపై ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja) సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు ఇండ్రస్ట్రీని తెచ్చేందుకు 40 ఏళ్లు పట్టిందని, ఏపీకి వెళ్లాలనుకునే వారు వెళ్లొచ్చన్నారు. ఒకప్పుడు ఏపీలోని గోదావరి జిల్లాలకు వెళ్లి షూటింగ్‌లు చేసే వారమని, కానీ ఇప్పుడు తెలంగాణలోనూ పంటలు సస్యశ్యామలంగా పండడంతో షూటింగులు ఇక్కడా జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. సముద్రం మాత్రమే లేదని మీలాంటి గొప్పవాళ్లు ఎవరైనా హైదరాబాద్‌కు సముద్రాన్ని తెస్తే ఇక్కడే షూటింగ్ చేస్తామని మీడియా ప్రతినిధులపై తమ్మారెడ్డి వ్యాఖ్యలు చేశారు.