యువత క్రీడల్లో రాణించాలి
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:41 AM
యువత క్రీడల్లో రాణించాలని మునిసిపల్ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

యువత క్రీడల్లో రాణించాలి
నల్లగొండ మునిసిపల్ చైర్మన బుర్రి శ్రీనివాస్‌రెడ్డి
నల్లగొండ స్పోర్ట్స్, జూలై 7: యువత క్రీడల్లో రాణించాలని మునిసిపల్ చైర్మన బుర్రి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉమ్మడి నల్లగొండ అండర్-25 క్రికెట్ ఎంపిక పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని క్రీడా జట్లు ఆటలో మెళకువలు నేర్చుకొని, నైపుణ్యాన్ని వృద్ధి చేసుకొని జాతీయ జట్టు కు ఎంపిక కావాలని సూచించారు. ఇప్పటికే నల్లగొండ క్రికెటర్స్ రంజీ ట్రోఫీలో కూడా ఆడుతున్నారని గుర్తు చేశారు. అనంతరం ఎంపిక పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన జిల్లా కార్యదర్శి సయ్యద్ హమీనుద్దీన, ఫసీనుద్దీన, నజీర్, ఉమేర్, వంగాల అనిల్‌రెడ్డి, కోచ సయ్యద్ షఫీనుద్దీన, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.