Share News

సైబర్‌ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:40 AM

యువత మాదకద్రవ్యాలకు బానిస లు కాకుండా, సైబర్‌మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ వీరశేఖర్‌ కోరారు.

 సైబర్‌ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి
విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్‌ఐ వీరశేఖర్‌

సైబర్‌ మోసాలపై యువత అప్రమత్తంగా ఉండాలి

త్రిపురారం జూలై 27: యువత మాదకద్రవ్యాలకు బానిస లు కాకుండా, సైబర్‌మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ వీరశేఖర్‌ కోరారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ‘సైబర్‌ నేరాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన’పై శనివారం విద్యార్థులకు పోలీస్‌ కళాబృందంతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ వీరశేఖర్‌ మాట్లాడుతూ సైబ ర్‌ నేరాలపై ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సైబర్‌ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకొని నేరగాళ్లు డబ్బు లు దోచుకుంటున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇతర యాప్‌లు, లింకులు, ఈ మెయిల్స్‌తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నార ని అన్నారు. తమ వ్యక్తిగత బ్యాంకింగ్‌ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దన్నారు. ఫోనలలో ఓటీపీ, ఓఎల్‌ఎక్స్‌, పేటీఎం, గూ గుల్‌ పే, ఫోనపే, కేవైసీలను అప్‌డేట్‌ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించకూడదన్నారు. సైబర్‌ నేరాలకు గురైనప్పుడు 1930 ట్రోల్‌ఫ్రీ నెంబర్‌కు డయల్‌ చేయాలన్నారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి, యు వత చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైతే వచ్చే నష్టాలు, కుటుం బసభ్యులు పడే బాధల గురించి వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు ల్గొన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:40 AM