Share News

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:35 AM

ఆర్థిక ఇబ్బందులతో ఒక యువకు డు ఆత్మహత్య చేసుకున్నాడు.

 ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
రాఘవేందర్‌రెడ్డి

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

పెద్దఅడిశర్లపల్లి, జూన 1: ఆర్థిక ఇబ్బందులతో ఒక యువకు డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని చిలకమర్రి గ్రామ పంచాయతీలో గల సూరేపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గుడిపల్లి ఎస్‌ఐ న ర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.... సూరేపల్లి గ్రామానికి చెంది న తేలుకుంట్ల రాఘవేందర్‌రెడ్డి (38) కొండమల్లేపల్లిలో ఒక వైన్సషా ప్‌లో ఐదేళ్లుగా పనిచేస్తూ అత్తగారి గ్రామమైన కాల్వపల్లి గ్రామంలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. తన స్వంత గ్రామం సూ రేపల్లిలో ఐదు ఎకరాల్లో దొండ పందిరి పెట్టాడు. సరైన దిగుబడి రాకపోవడంతో అప్పులు చే శాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. శనివారం తెల్లవారుజామున తన అత్తగారి ఇంటి నుంచి బయలుదేరి సూరేపల్లిలోని తన వ్యవసాయ బావి వద్దకు వచ్చి ఉరి వేసుకు ని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టు పక్కల వారు వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతుడు రాఘవేందర్‌రెడ్డి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నర్సింహులు తెలిపారు.

Updated Date - Jun 02 , 2024 | 12:35 AM