Share News

హైదర్‌నగర్‌లో వై.కె. డిజైనర్స్ ఫ్యాబ్రిక్ స్టూడియో

ABN , Publish Date - Feb 29 , 2024 | 10:48 PM

ఇప్పుడు ప్రతి ఒక్కరు డిజైనర్ దుస్తులు ఇష్టపడుతున్నారు.. నేను వేసుకునే దుస్తులను ఎప్పటి నుంచో వై.కె ఫ్యాబ్రిక్ స్టూడియో వారే డిజైన్ చేస్తున్నారని తెలిపారు యాంకర్ రవి

హైదర్‌నగర్‌లో వై.కె. డిజైనర్స్ ఫ్యాబ్రిక్ స్టూడియో

హైదరాబాద్: ఇప్పుడు ప్రతి ఒక్కరు డిజైనర్ దుస్తులు ఇష్టపడుతున్నారు.. నేను వేసుకునే దుస్తులను ఎప్పటి నుంచో వై.కె ఫ్యాబ్రిక్ స్టూడియో వారే డిజైన్ చేస్తున్నారని తెలిపారు యాంకర్ రవి. జెఎన్‌టియు మెట్రో స్టేషన్ సమీపంలోని హైదర్‌నగర్‌లో జబర్దస్త్ రాకింగ్ రాకేష్, సుజాత‌తో కలిసి వై.కె. డిజైనర్ ఫ్యాబ్రిక్ స్టూడియో‌ను గురువారం ఆయన ప్రారంభించారు. అందరికీ నచ్చిన విధంగా.. అందుబాటు బడ్జెట్‌తో మంచి డిజైన్ దుస్తులు ఇక్కడ లభిస్తాయని ప్రారంభం అనంతరం యాంకర్ రవి తెలిపారు.

రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. వై.కె ఫ్యాబ్రిక్ స్టూడియో నాకు ఎప్పటి నుండో తెలుసు. ఇక్కడ అని రకాల డిజైన్లు లభిస్తాయి. ఇప్పుడు కూకట్ పల్లి, హైదర్‌నగర్‌ వాసులకు ఈ స్టూడియో మరింత అందుబాటులోకి వచ్చేసిందని అన్నారు. డిజైనర్ల దుస్తులలో, ఫాబ్రిక్‌పై డిజైన్ వర్క్ ఫాబ్రిక్ కంటే విలువైనదిగా మారిందని.. వై.కె. ఫ్యాబ్రిక్‌లోని డిజైనర్ వస్త్రాలు ఎంబ్రాయిడరీ, అల్లడం, డైయింగ్, మిర్రర్ వర్క్ మొదలైన అనేక రకాల శైలులలో నైపుణ్యంతో రూపొందించబడ్డాయని.. వై.కె. డిజైనర్స్ ఫ్యాబ్రిక్ స్టూడియో ప్రతినిధులు యశ్వంత్, కౌశల్య తెలిపారు. వై.కె డిజైనర్స్ ఫ్యాబ్రిక్ స్టూడియో వేలాది డిజైనర్ వస్త్రాలను నిల్వ చేస్తుంది, ఇవి కొత్త తరానికి ఇష్టమైనవిగా మారాయి. టెక్స్‌టైల్ ప్రియులు డిజైనర్ గార్మెంట్స్ పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు మరియు ఆసక్తిని కలిగి ఉంటారు. వై.కె డిజైనర్స్ ఫ్యాబ్రిక్ స్టూడియోను.. ప్రతి ఒక్కరికీ ఆధునిక ఫ్యాషన్‌లో విస్తృత ఎంపికలను అందించాలనే ఏకైక లక్ష్యంతో ప్రారంభించినట్లు‌గా వారు తెలిపారు.

Updated Date - Feb 29 , 2024 | 11:02 PM