ఖమ్మం మార్కెట్‌కు అరుదైన ‘ఎల్లోగోల్డ్‘ మిర్చి
ABN , Publish Date - Feb 06 , 2024 | 03:48 AM
ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం కొత్తరకం మిర్చి పంట అమ్మకానికి వచ్చింది. ‘ఎల్లోగోల్డ్‘ అని పిలిచే ఈ కొత్తరకం మిర్చి సుమారు 10 బస్తాలు అమ్మకానికి వచ్చాయి. సహజంగా ఎరుపు
ఆసక్తిగా తిలకించిన రైతులు మార్కెట్‌కు పోటెత్తిన తేజా మిర్చి
ఖమ్మం మార్కెట్ , ఫిబ్రవరి 5: ఖమ్మంలోని వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం కొత్తరకం మిర్చి పంట అమ్మకానికి వచ్చింది. ‘ఎల్లోగోల్డ్‘ అని పిలిచే ఈ కొత్తరకం మిర్చి సుమారు 10 బస్తాలు అమ్మకానికి వచ్చాయి. సహజంగా ఎరుపు రంగులో ఉండే మిర్చి పసుపు రంగులో ఉండటం చూసి రైతులు, హమాలీలు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఈ అరుదైన పంటను సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం ఎత్తిరాజాపురం గ్రామానికి చెందిన భూక్యా శ్రీను అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో సాగుచేశాడు. ఈ ఎల్లోగోల్డ్ మిర్చి పంటకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గతేడాది ఈ రకం మిర్చి క్వింటా రూ.40 వేలు ధర పలకగా ఈ ఏడాది ప్రస్తుతం కొంత డిమాండ్ తగ్గి క్వింటాలుకు రూ.20వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతోంది. ఈ మిర్చి నుంచి తీసిన ఆయిల్‌ను ఆయుర్వేద మందులలో, దాని పిప్పిని చిప్స్ తయారీలో ఉపయోగిస్తారని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. మరోవైపు తేజా రకం మిర్చిని తీసుకుని రైతులు భారీ సంఖ్యలో మార్కెట్‌కు తరలివచ్చారు. సుమారు 65 వేల మిర్చి బస్తాలు మార్కెట్‌కు అమ్మకానికి వచ్చాయి. ఈ సీజన్‌లో ఇంత భారీగా పంట రావడం ఇదే ప్రథమం. తేజా రకం డీలక్స్ ఎండు మిర్చి క్వింటాలుకు రూ.21,600 జెండాపాట ధర నిర్ణయించగా వ్యాపారులు నాణ్యతను బట్టి క్వింటాలుకు కనిష్ఠంగా రూ.14,000, నమూనా రకాలను క్వింటాలుకు రూ.19,500 వరకు కొనుగోలు చేశారు. అలాగే తాలు మిర్చి రకాలను బట్టి క్వింటాలుకు రూ.8,000 నుంచి రూ.11,000 వరకు కొనుగోలు చేశారు.