Share News

గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమానికి కృషి

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:19 PM

గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడు తామని స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు.

గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమానికి కృషి
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి

- బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

రాజాపూర్‌, జనవరి 5 : గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడు తామని స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. మండలంలోని సింగమ్మగూడ తండా నుంచి అంజమ్మగూడ తండా వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు, అలాగే వాచ్యాతండా నుంచి మర్రీబావి తండా వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని హనుమాన్‌ దేవాలయంలో నిర్వహించిన అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు మో హన్‌ నాయక్‌, ఎంపీపీ సుశీల, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కృషి, సంకల్పంతో ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చు

జడ్చర్ల : కృషి, సంకల్పం ఉంటే ఎత ఎత్తుకైన ఎదగొచ్చని చూపులేని దివ్యాంగులు నిరూపించారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అన్నారు. కళ్లులేకపోయినా, కుట్రలు, కుతంత్రాలు లేని మనుసున్న వారని దివ్యాంగులను అభివర్ణించారు. జడ్చర్ల పట్టణంలో శుక్రవారం జడ్చర్ల బ్లైండ్‌ లూయిస్‌ అసో సియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయిస్‌ బ్రెయిలీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగులతో కలిసి ఎమ్మెల్యే కేక్‌ను కట్‌ చేశారు. జడ్చర్లలో లూయిస్‌ బ్రెయిలీ విగ్రహం ఏర్పాటు చేయాలని, దివ్యాంగు లకు అందులో అంధులకు 5శాతం డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కేటాయించాలని, బ్యాక్‌లాగ్‌ పోస్ట్‌లను ఏర్పాటు చేయాలని, కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం కావాలని అసోసియేషన్‌ సభ్యులు చిక్కాహరీష్‌కుమార్‌, బాలరాజు, నాగరాజు, రాఘవేం దర్‌రెడ్డి, వెంకటేశ్‌ కోరారు. కార్యక్రమ నిర్వాహకులు ఘంటా జనార్దన్‌రెడ్డి, దివ్యాంగుల సంక్షేమశాఖ సూపరింటెండెంట్‌ అరుంధతి, ప్రేమ్‌కుమార్‌, జడ్చర్ల సీడీపీఓ మెహరున్నీసాబేగం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నిత్యానందం, బుర్ల వెంకటయ్య, బుక్క వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:19 PM