కార్మికులకు రూ.12 వేలు ఇవ్వాలి
ABN , Publish Date - Dec 29 , 2024 | 01:09 AM
ఉపాధి హామీకి సంబంధం లేకుండా వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య అన్నారు.

కార్మికులకు రూ.12 వేలు ఇవ్వాలి
వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య
నల్లగొండ రూరల్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీకి సంబంధం లేకుండా వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య అన్నారు. పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవనలో శనివారం నిర్వహించిన సంఘ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని వ్యవసాయ కార్మికులందరికీ సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామని, ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో మీడియాలో వస్తున్న విషయాలపై కార్మికులు అందోళన చెందుతున్నారని అన్నారు. లబ్ధిదారుల ఎంపికపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన కోరారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జ చిన వెంకులు, అనంద్, సైదులు తదితరులు పాల్గొన్నారు.