Share News

Kumaram Bheem Asifabad- సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Feb 12 , 2024 | 10:26 PM

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు

Kumaram Bheem Asifabad-     సమస్యల పరిష్కారానికి కృషి
దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 12: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆసిఫాబాద్‌ మండలం మోతుగూడ గ్రామానికి చెందిన విజయలక్ష్మి, తిరుపతి, బానక్క నిరుపేద కుటుంబానికి చెందిన తాము కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నామని, తమకు ఉపాధి కల్పించాలని వేర్వేరుగా దరఖాస్తులు అందజేశారు. ఆసిఫాబా ద్‌ పట్టణానికి చెందిన బాబురావు తాను కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నానని తనకు ఉపాధి కల్పించాలని దరఖాస్తు అందజేశాడు. ఆసిఫాబాద్‌ మండల కేంద్రానికి చెందిన పార్వ తి తాను డిగ్రీ పూర్తి చేశానని, నిరుపేద అయిన తనకు ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ అందజేసింది. రెబ్బెన మంలం నారాయణపూర్‌ గ్రామానికి చెందిన మాదాసు కిష్టయ్య తన తండ్రి నుంచి తమకు వారసత్వంగా రావాల్సిన భూమిని తమపెద్ద అన్న పేరిట నమోదు చేశారని, దీనిని సవరించి ముగ్గురు అన్నదమ్ములకు సమాన వాటాగా ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతీ దరఖాస్తును పరిశీలించి సంబంధిత శాఖాధికారుల సమన్వయంతో పరిష్కరించేం దుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ బోర్కడే హేమంత్‌ అన్నారు. సోమవారం జల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేవ మందిరంలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ఆర్జీదారులు చేసుకున్న దరఖాస్తుల పరిష్కారం, తిరస్కరణ వివరాలను సంబంధిత అర్జీదారుడికి లిఖిత పూర్వకంగా తెలియపర్చాలని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలను ప్రతి రోజు నివేదిక అందించాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను వారంలోగా పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరు అయిన అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనతరం అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, కాగజ్‌నగర్‌ ఆర్డీవో సురేష్‌తోతో కలిసి జిఇల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్‌లు, నాయబ్‌ తహసీల్దార్‌లతో ప్రజావాణి దరఖాస్తుల నిర్వహణపై సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తహసీల్దార్‌లు, నాయబ్‌ తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 10:26 PM