Share News

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN , Publish Date - May 16 , 2024 | 11:06 PM

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన వసతులకు సంబంధిత పనులను త్వరతగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ జి. రవి నాయక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి చేయాలి
వెబెక్స్‌ ద్వారా మాట్లాడుతున్న కలెక్టర్‌ జి. రవి నాయక్‌

- వెబెక్స్‌ ద్వారా సమీక్షించిన కలెక్టర్‌ జి. రవి నాయక్‌

మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), మే 16 : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన వసతులకు సంబంధిత పనులను త్వరతగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ జి. రవి నాయక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత కలెక్ట రేట్‌ సమావేశం మందిరం నుంచి వెబెక్స్‌ ద్వారా ఎంపీడీవోలు, ఎంఈవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఇంజనీరింగ్‌ అధికారులు, ఏపీఎంలు, మండల నోడల్‌ అధికారులు, కాంప్లెక్స్‌ స్కూల్‌ హెడ్‌ మాస్టర్లతో అమ్మ ఆదర్శ పాఠశా లల్లో చేపట్టిన పనులపై మండలాల వారీగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్‌, ఎలక్ట్రిసిటీ, పేయింటింగ్‌, మేజర్‌ మైనర్‌ మర మ్మతులు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టవలసిన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులు నాణ్యతగా ఉండాలని చెప్పారు. ఈ పాఠశాలల కింద చేపట్టే పనులు మండలాల వారీగా సమీక్షిస్తూ ఇంకా పనులు మొదలు పెట్టని పాఠశాలల్లో వెంటనే గ్రౌండింగ్‌ చేయాలని ఆదేశించారు. ఈ పనులకు సబంధించి 25 శాతం నిధులు ఎంపీడీవోలకు విడుదల చేసినట్లు తెలిపారు. వారి ద్వారా వీవోలకు చేరతాయన్నారు. పాఠశాలలు ప్రారంభానికి ముందు పనులను పూర్తి చేయాలని అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. పనులకు సంబంధించి మెటీరియల్‌ ప్రొక్యూర్‌ చేసుకోవాలని, పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు స్కూల్‌ యూనిఫాం క్లాత్‌ ఈ నెల 18న వస్తుందని, ఎంఈవోలు మండలంలో గుర్తించిన మహిళా సంఘాల ద్వారా కుట్టించాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌, డీఆర్డీవో నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 11:06 PM