Share News

Manchiryāla- మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Mar 06 , 2024 | 09:49 PM

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. వనితా వాక్కు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేటు హాలులో బుధవారం మహిల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అద్యక్షురాలు కొక్కిరాల సురేఖ అతిథిగా హాజరయ్యారు.

Manchiryāla-    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

ఏసీసీ, మార్చి 6 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. వనితా వాక్కు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రైవేటు హాలులో బుధవారం మహిల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అద్యక్షురాలు కొక్కిరాల సురేఖ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భర్త అంధుడై ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయినప్పటికీ మనోదైర్యం వీడకుండా కూరగాయలు అమ్ముతూ ఐదుగురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేసిన మహిళ లక్ష్మిని సన్మానించి రూ. 5 వేలు ఆర్ధిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో వనితావాక్కు ఫౌండర్‌ వేణుకుమార్‌ గోనె భాగ్యలక్ష్మీ, సఖి సెంటర్‌ అడ్మినిస్ర్టేటర్‌ శ్రీలత, మాతా శిశు సంక్షేమ అధికారిణి డాక్టర్‌ నీరజ, డాక్టర్‌ అన్నపూర్ణ, మంజుల, డాక్టర్‌ స్వరూపరాణి, చిదానందకుమారి, కవిత, సునీత పాల్గొన్నారు.

ఏసీసీ: మహిళల సంక్షేమం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని నారీశక్తి అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని హమాలీవాడలో వర్చువల్‌గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమపథకాలు అమలు చేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని బలపర్చి 400లకు పైగా సీట్లు వచ్చే విధంగా మహిళలు తోడ్పాడునం దించాలన్నారు. దేశ ప్రజలందరు తన కుటుంబీకులేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైన్‌, హరికృష్ణ, లావణ్య, శ్రీదేవి, హరికృష్ణ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాంపూర్‌: జీఎం కార్యాలయం ఎదుట ఉన్న కేంద్ర నర్సరీలో మహిళా ఉద్యోగినులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆటల పోటీలు నిర్వహించారు. బాంబ్‌ బ్లాస్ట్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, త్రో బాల్‌ పోటీలను డీజీఎం(పర్సనల్‌) అరవిందరావు ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ పర్సనల్‌ మేనేజర్‌ రాజు, సీనియర్‌ పీవోలు కాంతారావు, సునీల్‌ కుమార్‌, సంతన్‌, ఎస్టేట్స్‌ అధికారి వరలక్ష్మీ, లా అధికారి ప్రబంధిత, ఫైనాన్స్‌ అధికారులు పద్మ, శేష కుమారి, డాక్టర్‌ ఎం. మనీషా పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 09:49 PM