Share News

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి: ఎంపీ

ABN , Publish Date - Mar 06 , 2024 | 11:13 PM

దేశంలోని ప్రతీ మహిళ ఆత్మగౌరవంతో బతికి ఆర్థికాభివృద్ధి సాధించడమే ప్రధాని మోదీ సర్కార్‌ ధ్యేయమని నాగర్‌కర్నూల్‌ ఎంపీ పీ. రాములు, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు.

మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి: ఎంపీ
నారీశక్తి వందన్‌ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ రాములు

వెల్దండ, మార్చి 6 : దేశంలోని ప్రతీ మహిళ ఆత్మగౌరవంతో బతికి ఆర్థికాభివృద్ధి సాధించడమే ప్రధాని మోదీ సర్కార్‌ ధ్యేయమని నాగర్‌కర్నూల్‌ ఎంపీ పీ. రాములు, జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆకృతి గార్డెన్‌లో నియోజకవర్గస్థాయి నారీశక్తి వందన్‌ కార్య క్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ప్రధాని మోదీ ప్రసంగాన్ని డిజిటల్‌ ద్వారా సమావేశానికి హాజరైన మహిళలకు వినిపించారు. అనంతరం రాములు మాట్లాడుతూ ప్రధాని మోదీ చేపడుతున్న పథకాలు, దేశపురోగతి ప్రపంచస్థాయిలో ఉన్నాయన్నారు. మూడోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఆచారి మాట్లాడు తూ కేంద్రంలోని బీజేపీ ప్రవేశపెడుతున్న పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యెన్నం శేఖర్‌రెడ్డి, నాయకులు బండెల రాంచంద్రారెడ్డి, రాంపాల్‌, చక్రవర్తిగౌడ్‌, నర్సిరెడ్డి, కుర్మిద్దయాదగిరి, పరమేష్‌గౌడ్‌, రాఘవేందర్‌గౌడ్‌, కృష్ణగౌడ్‌, దుర్గాప్రసాద్‌, మోహన్‌రెడ్డి, నర్సింహ, శేఖర్‌రెడ్డి, రాంరెడ్డి, రామస్వామి తదితరులున్నారు.

Updated Date - Mar 06 , 2024 | 11:13 PM