పోటీల్లో గెలుపోటములు సహజం
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:01 PM
పోటీల్లో గెలుపు ఓటమిలు సహజమని, వాటి గురించి ఆలోచించకుండా ఆటల్లో నైపుణ్యం సాధించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత అన్నారు.

- జడ్పీ చైర్‌పర్సన్ సరిత
- అనంతపురంలో క్రికెట్ పోటీలు ప్రారంభం
గద్వాల, జనవరి 12: పోటీల్లో గెలుపు ఓటమిలు సహజమని, వాటి గురించి ఆలోచించకుండా ఆటల్లో నైపుణ్యం సాధించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత అన్నారు. శుక్రవారం పట్టణంలోని తెలుగుపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆమె ప్రారంభించారు. అదేవిధంగా మండల పరిధిలోని అనంతపురంలో రిద కాన్సెక్షన్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్బండా చైర్‌పర్సన్ సరిత మాట్లాడుతూ... గద్వాల క్రీడలకు పెట్టింది పేరని యువత రాణిస్తున్నారన్నారు. అనంతరం క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కబీర్‌దాస్ అనిత, మాజీ కౌన్సిలర్లు ఎల్లప్ప, పులిపాటి వెంకటేష్, భాస్కర్ యాదవ్, కబీర్‌దాస్ నర్సింహులు పాల్గొన్నారు. అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో బండ్ల రాజశేఖర్‌రెడ్డి, జమ్మిచేడు ఆనంద్, కుర్వ రాముడు, శ్రీనివాస్ గౌడ్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, ఆంజనేయులు, బంగారు మహిమూద్, పూడూరు ఈశ్వర్, గడ్డం శ్రీను, రాము యాదవ్, వడ్డే నర్సింహులు తదితరులున్నారు.