Share News

క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:05 PM

క్రీడల్లో గె లుపు, ఓటములు సహజమాని, క్రీడాస్పూర్తిని చాటా లని షటిల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌ గౌడ్‌ అన్నారు.

క్రీడల్లో గెలుపు, ఓటములు సహజం
క్రీడాకారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్న నిర్వాహకులు

- బ్యాడ్మింటన్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా

సంఘ అఽధ్యక్షుడు శ్యాంసుందర్‌గౌడ్‌

- హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లు

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌, జూలై 5 : క్రీడల్లో గె లుపు, ఓటములు సహజమాని, క్రీడాస్పూర్తిని చాటా లని షటిల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి 10వ అండర్‌-19 బాల,బాలికల షటిల్‌ బ్యాడ్మింటన్‌ రెండో రోజు పోటీలను డీవైఎస్‌వో ఎస్‌. శ్రీనివాస్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్యామ్‌ సుందర్‌ గౌడ్‌, రవికుమార్‌ ప్రారంభించారు. టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండోర్‌ స్టేడియం ఏర్పాటు చేయడం వల్ల మొదటి సారి రాష్ట్ర స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ నిర్వహించే అవకాశం లభించిందన్నారు. షటిల్‌బ్మాడింటన్‌ టోర్నీ లో ప్రతిభచాటి జాతీయస్థాయికి ఎదగాలని ఆకాం క్షించారు. జిల్లాలో షటిల్‌ బ్యా డ్మింటన్‌ క్రీడాభివృద్ధికి సం ఘం తరుపున కృషి చేస్తామ ని, ప్రతిభ గల క్రీడాకారులకు అండగా ఉంటామని తెలిపా రు. కార్యక్రమంలో తెలంగా ణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఎం డీబీఏ సెక్రటరీ ఎల్‌.రవి కు మార్‌, కార్యనిర్వహక కార్య దర్శి సాదత్‌ఖాన్‌, ఉపాఽధ్యక్షు లు విజయ్‌రెడ్డి, ప్రవీణ్‌ కుమా ర్‌, చైతన్యరెడ్డి, రాం కుమార్‌, ట్రైజరర్‌ ఎల్‌.రాజశేఖర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

- నేడు ఫైనల్స్‌

టోర్నీలోని మ్యాచ్‌లు హోరాహోరీగా కొనసాగుతు న్నాయి. రెండో రోజు నాకౌట్‌, క్వార్టర్‌ ఫైనల్‌, సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు నిర్వహించారు. పలువురు క్రీడాకా రులు సత్తాచాటి సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ లో ఫైనల్స్‌కు చేరారు. బాలుర సెమీఫైనల్స్‌ సింగిల్స్‌ లో అశ్రిత్‌ వలిశెట్టి(మెదక్‌) ఎస్‌.అఖిల్‌రావు (వరం గల్‌)పై, ఎం.అజయ్‌కార్తీక్‌(జనగామ) ప్రణవ్‌ శ్రీకర్‌ (నిజామాద్‌)పై విజయం సాధించారు. బాలికల సిం గిల్స్‌ సెమీస్‌లో శ్రేష్టరెడ్డి(హైదరాబాద్‌)పై, ప్రశంస (ఖమ్మం) రిషితా పాండే(వరంగల్‌)పై గెలుపొం దా రు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శ్రీసాయి, అలీసాలు, శౌర్యకిరణ్‌, ప్రాంజలపై విజయం సాధించారు. మరో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎం.అజయ్‌ కార్తీక్‌, కీర్తిలు, ఎల్లోరా,సాయిరామన్‌లపై గెలుపొందారు.

Updated Date - Jul 05 , 2024 | 11:05 PM