Share News

Manchiryāla- ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమయ్యేనా?

ABN , Publish Date - Mar 12 , 2024 | 10:43 PM

రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమ స్యలు దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. గత కొన్ని సంవ త్సరాల నుంచి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్ల సకాలంలో జీతాలు రాకపోవడం, పెండింగ్‌ బిల్లులు పేరుకుపోవడం తో నిరాశ నిస్ప్రహల్లో ఉన్నారు.

Manchiryāla-       ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమయ్యేనా?
లోగో

- పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ వస్తే మరింత జాప్యం

- ఏప్రిల్‌ 23తో ముగియనున్న విద్యా సంవత్సరం

- అప్పటిలోగా చర్యలు చేపట్టాలంటున్న సంఘాల నాయకులు

మంచిర్యాల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమ స్యలు దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. గత కొన్ని సంవ త్సరాల నుంచి ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్ల సకాలంలో జీతాలు రాకపోవడం, పెండింగ్‌ బిల్లులు పేరుకుపోవడం తో నిరాశ నిస్ప్రహల్లో ఉన్నారు. కొత్త ప్రభుత్వ హయాంలో గత మూడు నెలలుగా సక్రమంగా వేతనాలు అందుకుంటున్నారు. కాగా ఇతర అం శాల్లో మాత్రం ఇంకా పరిష్కారం దిశగా కృషి చేయక పోవడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. మరోవైపు పీఆర్‌సీపైన కమిటీ వేయకప ోవడం, గత పీఆర్సీ బకాయిలు నిలిచి పోవడం, జీపీఎఫ్‌, టీఎస్‌జీఎల్‌ఐ, సరెండర్‌ సెలవులు, మెడికల్‌ తదితర ఆర్థికపరమైన బిల్లులు సంవత్సరాలుగా పెం డింగులో ఉన్న కారణంగా ఆర్థిక ఇబ్బందులకు గురికాక తప్పని పరిస్థితు లు నెలకొన్నాయి.

- ఏడాదికి రెండు..

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వ పరంగా ఏడాదికి రెండు డీఏ (కరువు భత్యం)లు ప్రకటించవలసి ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నా లుగు డీఏలు ప్రకటించాల్సి ఉండగా, ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జూలై 2022, జనవరి 2023, జూలై 2023 మూడు విడుతలుగా డీఏ మంజూరు కావలసి ఉంది. కాగా ఈ సంవత్సరం జనవరికి సంబంధించి కూడా మరో డీఏ విడుదల కావ లసి ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఉద్యోగులకు ఎప్పటికప్పుడు డీఏలు మంజూరు చేస్తున్నారు. మరో డీఏ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉండగా, రాష్ట్రంలోని గత ప్రభుత్వం మూడు డీఏలను పెండింగులో ఉంచడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఈ కారణంగా ముఖ్యంగా పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా రిటైర్డ్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎప్పటి కప్పుడు కరువు భత్యం చెల్లించాల్సి ఉండగా, ఏకంగా రెండు సంవత్స రాలుగా ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయడం లేదనే అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.

- ప్రభుత్వ అలసత్వంతో..

రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వంతో డీఏ మంజూరులో జాప్యం చేసిన కార ణంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు అది అందకుండా పోయింది. ప్రస్తుతం కొత్త ప్రభుత్వమైన చెల్లిస్తుందేమోనన్న ఆశతో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. కాగా త్వరలో పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి కోడ్‌ అమల్లోకి వస్తే..ఆ సమయంలో ఎలాంటి బిల్లుల చెల్లింపు నకు అవకాశం ఉండదు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున ఇప్పట్లో ఇక డీఏలతో పాటు ఏ రకమైన బిల్లుల మంజూరుకు అవకాశమే ఉండదు. మరోవైపు సంఘాలతో సంప్రదింపులు లేకుండా హడావుడిగా ఐఆర్‌ (మధ్యంతర భృతి) 5 శాతం ప్రకటించడం కూడా ఉద్యోగ, ఉపాఽ ద్యాయులను నిరాశకు గురి చేసినట్లయింది. ఈ క్రమంలో కోడ్‌ అమల్లోకి రాకముందే కాంగ్రెస్‌ ప్రభుత్వం చొరవ తీసుకుని పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నారు.

- బదిలీలు జరిగినప్పటికీ..

ఈ మధ్యకాలంలో స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్ల బదిలీలు జరిగినప్పటికీ ప్రత్యామ్నాయం లేనందున పాత పాఠశాలల్లోనే విధులు నిర్వహిం చాల్సిన పరిస్థితి ఉంది. ట్రాన్స్‌ఫర్లలో భాగంగా ఆప్షన్ల ద్వారా కోరుకున్న చోటుకు, ఇతర పాఠశాలలకు కౌన్సిలింగ్‌ ద్వారా బదిలీ అయినప్పటికీ కొత్త ప్రాంతానికి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో బదిలీలు జరిగినా పాత స్థానాల్లోనే విధులు నిర్వహించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉపాధ్యాయులు తీవ్ర నిరాశ్యంలో మునిగిపోయారు. ఇదిలా ఉండగా ఏప్రిల్‌ 23తో ఈ విద్యాసంవత్సరం ముగియనుంది. కనీసం ఆ లోపైనా బదిలీ అయిన స్థానాల్లో విధులు నిర్వహించేలా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరోవైపు సెకం డరీ గ్రేడ్‌ టీచర్లకూ ట్రాన్స్‌ఫర్లు చేపట్టాలనే విజ్ఞప్తులు కూడా ఉన్నాయి.

స్థానికత కోల్పోయిన వారికి న్యాయం చేయాలి..

- పోకల వెంకటేశ్వర్లు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు

జీవో 317 ద్వారా ఎంతోమంది ఉద్యోగ, ఉపాధ్యాయులు స్థానికతను కోల్పోయి, తీవ్రంగా నష్టపోయారు. స్థానికతను కోల్పోవడం ద్వారా కు టుంబాలకు దూరమై అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలి. స్థానికతను కోల్పోయిన వారికి తిరిగి ఆ స్థానాలను కేటాయించాలి. అలాగే ట్రాన్స్‌ఫర్లలో భాగంగా ఇతర చోట్లకు బదిలీ అయిన వారిని కొత్త ప్రాంతాలకు వెంటనే వెళ్లేలా అవస రమైన చర్యలు చేపట్టాలి. డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల నియా మకం చేపట్టి పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి.

Updated Date - Mar 12 , 2024 | 10:43 PM