Share News

లీగల్‌ నోటీసులు పంపిస్తా!

ABN , Publish Date - Apr 03 , 2024 | 06:24 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై కాంగ్రెస్‌ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వారికి లీగల్‌ నోటీసులు

లీగల్‌ నోటీసులు పంపిస్తా!

నాపై సిగ్గులేని, నిరాధార ఆరోపణలు చేస్తున్నారు

క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు

మంత్రి కొండా సురేఖ, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి,

కేకే మహేందర్‌రెడ్డికి కేటీఆర్‌ హెచ్చరిక

నిజానిజాలు తెలుసుకోని మీడియా

సంస్థలకూ నోటీసులు పంపుతానని వెల్లడి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై కాంగ్రెస్‌ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వారికి లీగల్‌ నోటీసులు పంపిస్తానని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్‌ నేతలు కేకే మహేందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో కూడిన ఓ న్యూస్‌క్లిప్పింగ్‌ను ఎక్స్‌లో మంగళవారం పోస్ట్‌ చేస్తూ, దానిపై తన కామెంట్‌ జోడించారు. ‘పరువునష్టం, దుష్ప్రచారానికి సంబంధించి మంత్రితోసహా ఈ కాంగ్రెస్‌ నేతలకు లీగల్‌ నోటీసులు పంపిస్తా. ఈ సిగ్గులేని, నిరాధార, పిచ్చి ఆరోపణలపై క్షమాపణ చెప్పాలి.. లేదంటే, న్యాయపరమైన పరిణామాలను ఎదుర్కోవాలి. నిజానిజాలను తెలుసుకోకుండా చెత్తను వండివారుస్తున్న వార్తాసంస్థలకు కూడా లీగల్‌ నోటీసులు పంపిస్తా’ అని హెచ్చరించారు.

Updated Date - Apr 03 , 2024 | 06:24 AM