Share News

ఓపెన ఎయిర్‌ జైలు నిర్మాణమెప్పుడో?

ABN , Publish Date - May 31 , 2024 | 12:18 AM

దేవరకొండ డివిజన పరిధిలో ని నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌ ప్రాంతంలో 2018లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఓపెన ఎయిర్‌ జైల్‌ నిర్మించాలని నిర్ణయించింది.

 ఓపెన ఎయిర్‌ జైలు నిర్మాణమెప్పుడో?
నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌లో ఓపెన జైలు నిర్మాణం కోసం సర్వే చేస్తున్న అధికారులు (ఫైల్‌ ఫొటో)

ఓపెన ఎయిర్‌ జైలు నిర్మాణమెప్పుడో?

నేరేడుగొమ్ము మండలంలో ఏర్పాటుకు చర్యలు

భూమి కేటాయించిన ప్రభుత్వం

ఏళ్లు గడుస్తున్నా ప్రారంభం కాని పనులు

అన్యాక్రాంతమవుతున్న కేటాయించిన భూములు

దేవరకొండ, మే 30: దేవరకొండ డివిజన పరిధిలో ని నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌ ప్రాంతంలో 2018లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఓపెన ఎయిర్‌ జైల్‌ నిర్మించాలని నిర్ణయించింది. అప్పటి హోంమంత్రి నా యుని నర్సింహారెడ్డి తన సొంత మండలమైన నేరేడుగొమ్ము మండలంలో ఓపెన ఎయిర్‌ జైల్‌ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. పెద్దమునిగల్‌లో సర్వే నెంబ ర్‌ 299లో 350 ఎకరాలవరకు సర్వే చేశారు. ఓపెన ఎయిర్‌ జైల్‌ నిర్మాణానికి 289 ఎకరాలను జైళ్ల శాఖకు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జైల్‌ నిర్మాణానికి మొదటి విడతగా రూ.50కోట్లు కేటాయించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. జైళ్ల, రెవెన్యూశాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యటించి స్థలాన్ని కేటాయించారు. కానీ నేటికి ఓపెన ఎయిర్‌ జైల్‌ ప్రతిపాదనలకే పరిమితమైంది తప్ప నిర్మాణానికి నోచుకోలేదు. అప్పటి హోంమంత్రి నాయి ని నర్సింహారెడ్డి మృతి చెందడంతో ఓపెన ఎయిర్‌ జైల్‌ ప్రతిపాదనను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో పెద్దమునిగల్‌ శివారులో కేటాయించిన 289ఎకరాల భూమిపై స్థానికులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ పార్టీల నాయకుల కన్ను పడింది. కొంత భూమి ఇప్పటికే అన్యాక్రాంతమైందని స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన ఓపెన ఎయిర్‌ జైల్‌ నిర్మాణం జరుగుతందన్న ఆశాభావాన్ని స్థానికు లు వ్యక్తం చేస్తున్నారు. ఓపెన ఎయిర్‌ జైల్‌ మంజూరైతే పెద్దమునిగల్‌ ప్రాంతం అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే వైజాగ్‌కాలనీ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఏకోటూరిజం పనులు 40 శాతం వరకు పూర్తయ్యా యి. ఏకో టూరిజం, ఓపెన ఎయిర్‌జైల్‌ పూర్తయితే ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో పాటు అభివృద్ధి జరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ స్థలం ఉండటంతో ఓపెన ఎయిర్‌ జైలుకు ఆమోదం

కృష్ణా పరివాహక ప్రాంతమైన పెద్దమునిగల్‌ లో ప్రభుత్వ భూమి ఉండటంతో ఓపెన ఎయిర్‌ జైలు నిర్మించేందుకు అనువుగా ఉంటుందని, గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓపెన జైలు నిర్మాణం ఏర్పాటు చేస్తే వ్యవసాయ పనులతో పా టు ఖైదీలకు స్వయం ఉపాధి కల్పించాలని సంకల్పించింది. నాగార్జునసాగర్‌ బ్యాక్‌ వాటర్‌ దగ్గరగా ఉండటంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉం టుందని భావించారు. వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసి వనమూలికలు, కూరగాయలు, పండ్ల తోటల పెంపకం చేయాలని నిర్ణయించారు.

కానీ ప్రతిపాదనకే పరిమితమైంది తప్ప నిర్మాణానికి నోచుకోకపోవడంతో స్థానికులు నిరాశ చెందుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమం త్రి రేవంతరెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే బాలునాయక్‌ దృష్టి సారించి నిధులు కేటాయించి ఓపెన ఎయిర్‌ జైల్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నా రు. ఈ విషయ మై దేవరకొండ ఆర్డీవో శ్రీరాములుని వివరణ కోరగా గతంలో పెద్దమునిగల్‌లో ఓపెన ఎయిర్‌ జైలుకు ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమి స్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - May 31 , 2024 | 12:18 AM