క్యాంటీన్ నిర్మాణం పూర్తయ్యేదెప్పటికో..?
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:04 AM
సూర్యాపేటటౌన్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువుకట్టపై ఏడాది క్రితం నిర్మించ తల పెట్టిన క్యాంటీన్ పనులు ముందుకు సాగడం లేదు.

ఏడాదిన్నర క్రితం పనులు ప్రారంభం
సూర్యాపేటటౌన్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువుకట్టపై ఏడాది క్రితం నిర్మించ తల పెట్టిన క్యాంటీన్ పనులు ముందుకు సాగడం లేదు. సద్దుల చెరువు కట్టపై వివిధ రకాల బొమ్మల (చిన్న పిల్ల లు ఆడుకోవడానికి), క్యాంటీన్ నిర్మాణానికి ఏడాదిన్నర క్రి తం రూ.4 కోట్లు కేటాయించారు. అయితే ప్రస్తుతం బొమ్మ ల ఏర్పాటు పూర్తయిన క్యాంటీన్ పనులు మాత్రం ముం దుకు సాగడంలేదు. ఒక పక్క బోటింగ్ నడుస్తుండడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటివరకు దాదా పుగా 60 శాతం మేరకు మాత్రమే పనులు పూర్తయ్యాయి.
అడ్డగోలు వ్యాపారాలు
జిల్లా కేంద్రానికి నడిబొడ్డున ఉన్న సద్దుల చెరువును మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దడం జరిగింది. దీంతో ఉద యం, సాయంత్రం వేళల్లో అనేకమంది వ్యాయామానికి ఇక్కడికి వస్తుంటారు. అంతేకాకుండా ఆహ్లాదం, కాలక్షేపం కోసం కుటుంబంతో కలిసి అనేక మంది సాయంత్రం సమ యంలో వస్తున్నారు. దీనికి తోడు ఇటీవల బోటింగ్ ఏర్పా టు చేయడంతో సందర్శకుల తాకిడీ పెరిగింది. దీంతో సద్దుల చెరువు వద్ద కొందరు చిరువ్యాపారులు తమ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా ఐస్‌క్రీం, మొక్కజొన్న కంకుల, పల్లీల, చెరుకు రసాలతోపుడు బండ్ల వ్యాపారం బాగాపెరిగింది. దీంతో అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ప్రజలు ఆరో పిస్తున్నారు. క్యాంటీన్ ఏర్పాటు చేస్తే నాణ్యమైన ఆహార పదార్థాలు అందు బాటులోకి వస్తాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తు న్నారు.