Share News

మట్టి తవ్వకాలపై అజమాయిషీ ఏదీ?

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:23 AM

బీబీనగర్‌ మండలంలో మట్టిమాఫియా చెలరేగిపోతోంది. ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు.

 మట్టి తవ్వకాలపై అజమాయిషీ ఏదీ?
రాఘవాపురంలో పరిధిలో గోల్డెనఫారెస్ట్‌ భూముల్లో మట్టిని తవ్వుతున్న యంత్రాలు

ప్రభుత్వ..గోల్డెన ఫారెస్టు భూముల్లో మట్టి తవ్వకాలు

సుప్రీం కోర్టు ఆధీనంలోని భూములపై కొరవడిన పర్యవేక్షణ

ఫిర్యాదులు అందినా పట్టింపేదీ?

బీబీనగర్‌, ఏప్రిల్‌ 4: బీబీనగర్‌ మండలంలో మట్టిమాఫియా చెలరేగిపోతోంది. ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న వందల కోట్ల విలువ చేసే భూములపై మట్టి మాఫియా కన్ను పడింది. బీబీనగర్‌ - భూదానపోచంపల్లి మార్గంలో రోడ్డుకు ఇరువైపులా విస్తరించి ఉన్న గోల్డెన ఫారెస్టు భూముల్లోకి చొరబడి మట్టిని తవ్వేస్తూ లూటీ చేస్తున్నారు. సుమారు రెండు నెలలకు పైగా ఇక్కడి భూముల్లోకి చొరబడి భారీ యంత్ర సామగ్రితో ఇష్టానుసారంగా తవ్వేస్తూ వందలాది టిప్పర్ల మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలపై సంబంధిత రెవెన్యూ, మైనింగ్‌, పోలీస్‌ శాఖకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గోల్డెన ఫారెస్టు భూముల్లో..

బీబీనగర్‌-భూదానపోచంపల్లి ప్రధాన రహదారి మార్గంలో వందల కోట్లు విలువ చేసే గోల్డెన ఫారెస్టు భూములపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఇదే అదునుగా మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. పెట్టిన పెట్టుబడికి మూడేళ్లలో రెట్టింపు చెల్లిస్తామని ప్రజలను నమ్మబలికి గోల్డెన సంస్థ వేలాది మంది సంస్థల్లో డిపాజిట్‌ చేసిన పెట్టుబడి డబ్బులతో గోల్డెన ఫారెస్టు ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ , గోల్డెన టూరిస్టు రిసార్ట్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌ పేర్లతో రాఘవాపురం రెవెన్యూ పరిధిలో 300 ఎకరాలకు పైగా భూములను ఈ సంస్థ రెండు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసింది. ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఇక్కడి భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టింది. కాగా ఈ సంస్థ యజమానిపై అవినీతి ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. దీని కారణంగా ఇక్కడి భూముల అంశం వివాదంగా మారింది. చివరకు సుప్రీం కోర్టు ఆధీనంలోకి వెళ్లింది. అప్పటి నుంచి ఈ భూములపై పర్యవేక్షణ కొరవడింది. ఇదే అదునుగా భావించి అప్పటికే సంస్థకు భూములను విక్రయించిన స్థానిక రైతులు తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకుని పంటలు సాగు చేస్తుండగా మిగతా వారు మట్టి మాఫియాతో కుమ్మక్కై మట్టిని తవ్వేస్తున్నారు. బీబీనగర్‌, రాఘవాపురంతో పాటు మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్‌ మండలం అవుషాపురం గ్రామానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి గుట్టు చప్పుడు కాకుండా మట్టి వ్యాపారానికి తెరలేపారు.

తరలుతున్న సారవంతమైన మట్టి

వందల కోట్లు విలువ అయిన గోల్డెన ఫారెస్టు భూములలో కొన్ని నెలలుగా మట్టి తవ్వకాలు జరపడం వల్ల సారవంతమైన భూములు పెద్ద పెద్ద గోతులుగా తయారయ్యాయి. ఎక్స్‌కవేటర్లను ఉపయోగించి, మట్టిని తవ్వి వందలాది టిప్పర్ల మట్టిని ఇతర ప్రాంతాలలోని వెంచర్లకు, ఇతర అవసరాలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పగటిపూట విరామం ఇచ్చి రాత్రి పూట మట్టిని తవ్వకాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో సారవంతమైన భూములు గోతులతో నిండిపోతున్నాయని పేర్కొంటున్నారు. గోల్డెన ఫారెస్టు భూములలో జరుగుతున్న మట్టి తవ్వకాలపై ఫిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. సుప్రీం కోర్టు ఆధీనంలో ఉన్న కోట్ల విలువ చేసే భూముల్లో తవ్వకాలు జరుపుతున్న మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

తవ్వకాలు చేసేవారిపై చర్యలు తీసుకుంటాం

గోల్డెన ఫారెస్టు ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని నా దృష్టికి వచ్చింది. ప్రభుత్వ అసైన్డ భూముల్లో ఎవ్వరు తవ్వకాలు జరిపినా యంత్రాలు, వాహనాలను సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తాం. పోలీస్‌ శాఖతో కలిసి మట్టి రవాణా మార్గాల్లో చెక్‌పోస్టు పెట్టి పూర్తిగా నియంత్రిస్తాం.

-శ్రీధర్‌, తహసీల్దార్‌, బీబీనగర్‌

Updated Date - Apr 05 , 2024 | 12:23 AM