Share News

మహేంద్రుడి వ్యూహమేంటి?

ABN , Publish Date - May 15 , 2024 | 11:52 PM

ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఈ నెల 13న తాండూరులో ఓటు వేసిన అనంతరం మహేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తాము తాండూరును వీడేది లేదని, తనపై చేసిన దుష్పప్రచారాన్ని ఎవరూ నమ్మరని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది.

మహేంద్రుడి వ్యూహమేంటి?

నియోజకవర్గ రాజకీయాల్లో చర్చ

మళ్లీ తాండూరు పాలిటిక్స్‌పై పెరిగిన ఆసక్తి

తాండూరు, మే 15: ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఈ నెల 13న తాండూరులో ఓటు వేసిన అనంతరం మహేందర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. తాము తాండూరును వీడేది లేదని, తనపై చేసిన దుష్పప్రచారాన్ని ఎవరూ నమ్మరని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి కాంగ్రె్‌సలో కొనసాగుతున్నారు. ఆయన సతీమణి సునీతారెడ్డికి మల్కాజ్‌గిరి టికెట్‌ కేటాయించడంతో మహేందర్‌రెడ్డి ఊహించని రాజకీయ పరిణామాన్ని ఎదుర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటేసేందుకు తాండూరు వచ్చిన మహేందర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని, అది కూడా తాండూరు నుంచేనని ప్రకటించారు. మరోసారి మహేందర్‌రెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా బుయ్యని మనోహర్‌రెడ్డి ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఇక తాండూరు దరిద్రం వదిలింది. చేవెళ్ల పార్లమెంటు నుంచి మల్కాజగిరి పోయారు. ఇక అంతా మంచే జరుగుతుందని అని మహేందర్‌ రెడ్డినుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈవ్యాఖ్యల నేపథ్యంలోనే మహేందర్‌రెడ్డి తాండూరును వీడేది లేదని ఆయన వ్యాఖ్యానించారని అనుచరులు అంటున్నారు. కాంగ్రెష్‌ ఎమ్మెల్యేనే ఉండగా ఈయన తాండూరు వీడను, పోటీ చేస్తా అన్న దానిపై స్థానిక కాంగ్రెస్‌ పార్టీలో చర్చకు దారి తీసింది. వచ్చే ఎన్నికల నాటికి మహేందర్‌రెడ్డి ఏపార్టీ నుంచి పోటీ చేస్తారో చూడాలని అంతా చర్చించుకుంటున్నారు. తాండూరులోని ఆయన అనుచరులకు అభయం ఇచ్చేందుకే ఇలా మాట్లాడారనే చర్చా సాగుతోంది. మున్ముందు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మహేందర్‌రెడ్డి వర్గీయులకు అభయం ఇచ్చేందుకే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కాంగ్రెస్‌ పార్టీలో మరో వర్గం చర్చించుకుంటోంది.

Updated Date - May 15 , 2024 | 11:52 PM