Share News

Kumaram Bheem Asifabad- సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Jan 09 , 2024 | 10:28 PM

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కోలాం గిరిజ నులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. మండలంలోని కంచన్‌పల్లి గ్రామపంచాయతీలోగల ములాగుడా కోలాం గిరిజనులతో మంగళవారం ఆయన మాట్లాడారు.

Kumaram Bheem Asifabad-   సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
లింగాపూర్‌లో ఆధార్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

లింగాపూర్‌, జనవరి 9: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కోలాం గిరిజ నులు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. మండలంలోని కంచన్‌పల్లి గ్రామపంచాయతీలోగల ములాగుడా కోలాం గిరిజనులతో మంగళవారం ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలపై అవగాహన కల్పించారు. సంక్షేమ పథకాలు పొందేందుకు ప్రతి ఒక్కరూ ఆధార్‌కార్డు పొందాలన్నారు. ఈ మేరకుములాగుడాలో వారికోసం ప్రత్యేక ఆధార్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. వైద్యాధికారులు ఏర్పాటు చేసిన శిబిరాన్ని పరిశీలించారు. ఆదివాసీలకు ఆరోగ్య పరమైన సేవలను ఆందించాలని సూచించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఏప్పటికప్పుడు ఇవ్వాలని అన్నారు. ప్రధానమంత్రి జన్‌మన్‌ కార్యక్రమంలో గిరిజనులను ఆన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్‌, ఏపీఎం దేవానంద్‌, ఎంపీవో ఉమర్‌ఫరిఫ్‌, సర్పంచ్‌ కనకజ్యోతిరాం తదితరులు పాల్గొన్నారు.

జైనూర్‌: ప్రజా పరిపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను త్వరగా ఆన్‌లైన్‌ చేయాల ని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. మండలంలో ఇదివరకు వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. ఆదేవిధంగా ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పరిపాలన కార్యక్రమం సజావుగా పార దర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మారుమూల గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులు దృష్టి సారించలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రభుదయ, సూరింటెండెంట్‌ రాంచందర్‌, గ్రామ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 10:28 PM