Share News

సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలి: బీర్ల

ABN , Publish Date - May 16 , 2024 | 12:06 AM

పట్టభద్రుల కోసం ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమంపై విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య కోరారు.

సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలి: బీర్ల
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

భువనగిరి అర్బన్‌, మే 15: పట్టభద్రుల కోసం ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమంపై విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య కోరారు. బుధవారం యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో జరిగిన కాంగ్రెస్‌ ఆలేరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్‌ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుడి ప్రతి నాయకుడికి తమ తోడ్పాటునందిస్తూ విస్తృతంగా పర్యటి స్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ కూడా దక్కదన్నారు. బతుకు, ఉద్యోగ రీత్యా పట్టభద్రులను గుర్తించి ప్రజాపాలన మీ ముందుకు వచ్చిందనే నినాదంతో ముందుకెళ్లాలని కార్యకర్తలకు చెప్పారు. పట్టభ దుల కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌) మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ హయాంలో మాజీ సీఎం కేసీఆర్‌ ఎన్ని ఆఫ ర్లు ఇచ్చినా వాటికి తలవంచలేదని, తాను ఎల్లప్పుడు ప్రజా సేవకుడి నని అన్నారు. ఆలేరు గడ్డ గొప్ప వ్యక్తులను అందించిన నెల అన్నారు. తాను సేవకుడిగా పని చేస్తానని, ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశానన్నారు. ఆలేరు ప్రజల ఆశయాలు ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉంటానన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగుల కు జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి ఉండేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన సమయంలో ఉద్యోగులకు జీతా లు అందుతున్నాయని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి ప్రభు త్వం ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తుందన్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జాబ్‌ క్యాలండర్‌ విడుదల చేయాలని తాను సీఎంను కోరినట్లు తెలిపారు. ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా 10,500 మంది పట్టభద్రు లు ఉన్నారని, వారందరు మొదటి ప్రాధాన్య ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, యాదగిరిగుట్ట, ఆలేరు, ఆత్మకూర్‌(ఎం) ఎంపీ పీలు చీర శ్రీశైలం, గంధమల్ల అశోక్‌, తండ మంగమ్మ శ్రీశైలం, జడ్పీ టీసీ నరేందర్‌గుప్త, నాయకులు జనగాం ఉపేందర్‌రెడ్డి, నీల పద్మ, కానుగు బాలరాజు, మహేందర్‌గౌడ్‌, చిన్నింటి మల్లేశం, కొండ్రోజు వెంకటేశ్వరరాజు, శంకర్‌నాయక్‌, యాస లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 12:06 AM