దీపదాస్‌కు ఘనస్వాగతం
ABN , Publish Date - Feb 06 , 2024 | 10:30 PM
: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపదాస్ మున్షీకి మేడ్చల్‌లో కాంగ్రోస్ నాయకులు ఘనస్వాగతం పలికారు.
మేడ్చల్ టౌన్, ఫిబ్రవరి 6 : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపదాస్ మున్షీకి మేడ్చల్‌లో కాంగ్రోస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. మంగళవారం సిద్దిపేటలో బహిరంగ సభకు వెళ్తున్న క్రమంలో మేడ్చల్‌లోని వివేకానంద చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు, మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌యాదవ్, నాయకులు నక్క ప్రభాకర్‌గౌడ్‌లు గజమాలతో సన్మానించారు. పార్టీ సీనియర్ నాయకులతో పాటు పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు దీపదాస్‌కు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలను అందజేశారు. అంతకు ముందు ఓఆర్‌ఆర్ సర్వీసు రోడ్డు జంక్షన్ వద్ద గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ, శామీర్‌పేట, కీసర, ఘట్కేసేర్, మేడ్చల్ మండలాల నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి, రమణారెడ్డి, లక్ష్మన్, చాప రాజు, సందీప్, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.