Share News

పెళ్లి సందడి !

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:54 PM

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వివాహాల కోలాహలం ప్రారంభఐమ. ఈనెల 11వ తేదీన మాఘమాసం ప్రారంభమవుతుండటంతో మంచి ముహూర్తాల్లో పెళ్లిళ్లు జరిపించడానికి తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.సుమారు రెండు నెలల విరామం తర్వాత శుభఘడియలు ఉండడంతో కల్యాణ మండపాల వద్ద పెళ్లి బృందాల సందడి మొదలు కానుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో నూతన జంటలు ఒక్కటి కానున్నారు. ఇందుకు అనుగుణంగా వధూవరులు, తల్లిదండ్రులు ముందస్తు పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉన్నారు.

పెళ్లి సందడి !

ఈనెల 11 నుంచి మాఘమాసం ప్రారంభం

ఏప్రిల్‌ 26 వరకు వివాహాల కోలాహలం

3 నెలలు.. 30 రోజులు మంచి ఘడియలు

ఆ తర్వాత మూఢం, శూన్యమాసం

తిరిగి ఆశ్వయుజ మాసంలో ముహూర్తాలు

ఉమ్మడి జిల్లాలో వేలల్లో జరగనున్న పెళ్లిళ్లు.. ఒక్కటి కానున్న కొత్త జంటలు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వివాహాల కోలాహలం ప్రారంభఐమ. ఈనెల 11వ తేదీన మాఘమాసం ప్రారంభమవుతుండటంతో మంచి ముహూర్తాల్లో పెళ్లిళ్లు జరిపించడానికి తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.సుమారు రెండు నెలల విరామం తర్వాత శుభఘడియలు ఉండడంతో కల్యాణ మండపాల వద్ద పెళ్లి బృందాల సందడి మొదలు కానుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో నూతన జంటలు ఒక్కటి కానున్నారు. ఇందుకు అనుగుణంగా వధూవరులు, తల్లిదండ్రులు ముందస్తు పెళ్లి పనుల్లో బిజీబిజీగా ఉన్నారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 7): మాఘమాసం ఎప్పుడు వస్తుందా.. మంచి ముహూర్తం ఎప్పుడు కుదురుతుందా.. అని నవ వధూవరులు ప్రతీ ఏటా ఎదురు చూస్తుంటారు. ఇక ఆ టైం.. రానే వచ్చేసింది. పెళ్లి బాజా మోగే సమయం ఆసన్నమైంది. ఈనెల 11వ తేదీన మాఘమాసం ప్రారంభమవుతుండటంతో పెళ్లి సందడి మొదలైంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ 26 వరకు మూడు నెలల్లో మంచి ముహూర్తాలున్నాయి. తర్వాత ఏప్రిల్‌ 28 నుంచి మూఢం ప్రారంభమవుతుంది. దీంతో వైశాఖం, జ్యేష్ట మాసాల్లో వివాహ ముహూర్తాలు లేవని పురోహితులు చెబుతున్నారు. తర్వాత ఆశాఢం శూన్య మాసం కావడంతో శుభ కార్యాలకు పనికిరాదు. మళ్లీ ఆశ్వీజం దసరా తర్వాత తిరిగి వివాహాలు జరగనున్నాయి.

ఏప్రిల్‌ 26 వరకే ముహూర్తాలు

మాఘం, ఫాల్గుణం, చైత్రం ఈ మూడు మాసాలు (ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో) దాదాపు 30వరకు ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. ఫిబ్రవరి 11న తొలి ముహూర్తం మొదలుకుని ఏప్రిల్‌ 26వ తేదీ వరకు మంచి ఘడియలు న్నాయని ప్రకటించారు.

ఆరు నెలల వరకు ఆగాల్సిందే...

సాధారణంగా మే నెలలో కూడా పెళ్లి ముహూర్తాలు బాగా ఉంటాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ 26వ తేదీతోనే పెళ్లి ఘడియలు అయిపోతున్నాయి. తర్వాత మూఢం వస్తుంది. దసరా తర్వాత (ఆశ్వయుజ) అక్టోబరు 12 తర్వాత ముహూర్తాలున్నాయి. ఆరు నెలల వరకు పెళ్లి ముహూర్తాలు లేవని పండితులు పేర్కొంటున్నారు.

దివ్యమైన ముహూర్తాలు ..

ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం నవమి, రోహిని నక్షత్రం ఉండటంతో ఆ రోజు దివ్యమైన ముహూర్తం ఉంది. ఆరోజు వేల జంటలు ఒక్కటి కానున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీన వసంత పంచమి, రేవతి నక్షత్రం ఉంది. మార్చి ఒకటో తేదీ శుక్రవారం శష్టి, స్వాతి నక్షత్రం లో, 3వ తేది ఆదివారం అనురాధ నక్షత్రం, 7వ తేది గురువారం ఉత్తరాషాఢ నక్షత్రంలో దివ్యమైన ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు అధికంగా జరగనున్నాయి. అలాగే మార్చి 13వ తేదీ ఆశ్వినీ నక్షత్రం, 22వతేదీ శుక్రవారం మగ నక్షత్రం, 24 ఆదివారం ఉత్తర నక్షత్రం, 27వ తేదీ బుధవారం చిత్తానక్షత్రం, 28వ తేదీ గురువారం స్వాతి నక్షత్రంలో మంచి ముహూర్తాలున్నాయి.. ఏప్రిల్‌ 3వ తేదీన ఉత్తరాషాఢ నక్షత్రం, అదే నెలలో చివరి దివ్యమైన ముహూర్తం 4వ తేదీ శ్రవణ నక్షత్రం కావడంతో పెళ్లిళ్లు జరగనున్నాయి.

లీపు సంవత్సరంలో..

లీపు సంవత్సరం నాలుగు సంవత్సరాలకు ఒకసారి అరుదుగా వస్తుంది. ఈ రోజు ఎంతో మందికి ప్రత్యేకం కూడా, సాధారణంగా ప్రతిఏటా క్యాలెండర్‌లో 365 రోజులు ఉంటే.. ఈ ఏడాది మాత్రం 366 రోజులు ఉంటాయి. అందుకే దీనిని లీపు సంవత్సరం అంటున్నాం. ఈరోజు పుట్టిన వారికి నాలుగేళ్లకోసారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌న్‌ జరుపుకుంటారు. ఇక ఈ రోజు పెళ్లి చేసుకున్న వారు కూడా అంతే. వారి మ్యారేజ్‌ యానివర్సరీ నాలుగేళ్లకు వస్తుందన్న మాట. కొంత మంది వధూవరులు లీపు సంవత్సరాన్ని ఎంచుకున్నారు. లీపు సంవత్సరం ఫిబ్రవరి 29న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు.

శుభ ఘడియలు ఇవే...

మాఘం : ఫిబ్రవరి 13, 14, 17, 18, 24, 27, 28, 29, మార్చి 2, 3 తేదీలు

ఫాల్గుణం : మార్చి 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30, ఏప్రిల్‌ 3, 4 తేదీలు

చైత్రం : ఏప్రిల్‌ 9, 18, 19, 20, 21, 22, 24, 26 తేదీలు

ఏప్రిల్‌ 28 నుంచి మూఢం ప్రారంభం, ఆక్టోబరు వరకు వివాహ ముహుర్తాలు లేవు

ఫంక్షన్‌ హాల్స్‌ బుకింగ్‌ జోరు

వరుసగా పెళ్లి ముహూర్తాలు ఉండటంతో ఫంక్షన్‌హాల్స్‌ బుకింగ్‌ జోరుగా కొనసాగుతోంది. నగర శివారులో రికార్డు స్థాయిలో ఫంక్షన్‌ హాల్స్‌ ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి వర్గాల ప్రజలు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఫంక్షన్‌ హాల్స్‌ బుక్‌ చేసుకుంటున్నారు. ఆర్థికంగా ఉన్న వాళ్లు మాత్రం అందుకనుగుణంగా పెళ్లిళ్లు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద కన్వెన్షన్లు బుక్‌ చేసుకుంటున్నారు. వీటి అద్దె లక్షల్లోనే ఉంటున్నా.. ఏమాత్రం వెనుకాడడం లేదు.

చేతినిండా పని

వివాహాల శుభఘడియల నేపథ్యంలో అన్ని వర్గాలకు ఉపాధి లభించనుంది. పెళ్లిళ్లు జరిగితే వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. ప్లవర్‌ డెకరేషన్‌, భజంత్రీలు, వంటమాస్టర్స్‌, ఫోటో, వీడియోగ్రాఫర్స్‌, పురోహితులకు మంచి డిమాండ్‌ ఏర్పడనుంది. వివాహాలు జరుపుకునేందుకు కల్యాణమండపాలు, కన్వెన్షన్‌ హాల్స్‌, సత్రాలు, గదులు, క్యాటరింగ్‌ వంటివి ముందుగానే రిజర్వ్‌ చేసుకుంటున్నారు. మార్కెట్‌లో ఇప్పటికే వస్ర్తాలు, బంగారం, సరుకులు కొనుగోళ్ల సందడి నెలకొంది. పట్టణాల్లో బంగారం షాపులు, వస్త్ర దుకాణాలు రద్దీగా మారాయి.

మూడు నెలల్లో జోరుగా వివాహాలు

ఈ ఏడాది వివిధ కారణాల వల్ల వివాహ ముహుర్తాలు తక్కువగా ఉన్నాయి. ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్‌ 26వ తేదీ వరకూ ముహూర్తాలు ఉన్నందున వివాహాలు ఎక్కువగానే జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి 18న దివ్యమైన ముహూర్తం ఉండటంతో ఆ రోజు నాకు మూడు వివాహాలు బుక్‌ అయ్యాయి. చేగిరెడ్డి ఘనాపూర్‌లో ఫిబ్రవరి 16, 17, 18 రామాలయం, శివాలయం, ఆంజనేయస్వామి, ధ్వజ స్తంభం, నవగ్రహాల ప్రతిష్ఠపనతో పాటు వివాహాలు ఉన్నాయి.

- జోషి రాఘవేందర్‌రావు, పురోహితులు, చేగిరెడ్డి ఘనాపూర్‌, చౌదరిగూడ మండలం

ఆరు పెళ్లిళ్లు బుక్‌ అయ్యాయి

నాకు డెకరేషనే జీవనాధారం, వివాహాది శుభకార్యాలయాలకు వివిధ డిజైన్‌లో డెకరేషన్‌ చేస్తారు. ఎక్కువగా మార్చిలో డెకరేషన్‌ కోసం బుక్‌ చేసుకున్నారు. షాద్‌నగర్‌లోని ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌హాల్లో ఎవరు పెళ్లి చేసినా డెకరేషన్‌ నేనే చేస్తాను. మార్చిలో 27, 28, 14, 22, 29, 17, తేదీల్లో డెకరేషన్‌ కోసం బుక్‌ చేసుకున్నారు.

- శేఖర్‌, డెకరేషనిస్టు, కొందుర్గు గ్రామం

పెళ్లిళ్ల గిరాకి బాగానే ఉంది

ఈసారి పెళ్లిళ్ల గిరాకీ బాగానే ఉంది. ఈ నెల, వచ్చేనెల టెంట్‌ హౌస్‌ సామాన్లు బుక్‌ చేసుకున్నారు. టెంట్‌ వేసేందుకు కూలీలు దొరకడం లేదు. కూలీ రేట్లు పెంచేశారు. ఈ సారి మేము కూడ టెంట్ల ధరలు 10 శాతం పెంచుతున్నాం. పెళ్లిళ్ల సీజన్‌తో ఉపాధి లభిస్తుంది.

- యం. లక్ష్మయ్య, టెంట్‌ హౌస్‌, మేడిపల్లి గ్రామం

14వ తేదీ ఎక్కువగా ఆర్డర్స్‌ వచ్చాయి

ఈనెల 14వ తేదీ వసంత పంచమి ఉండటం.. ఆ రోజు దివ్యమైన ముహూర్తం ఉండటంతో పెళ్లిళ్లు ఎక్కువగా జరగనున్నాయి. దీంతో పెళ్లి పత్రికలకు ఆర్డర్స్‌ ఎక్కువగా వచ్చాయి. వచ్చే నెలకు సంబంధించ్లి కూడాఆర్డర్స్‌ వస్తున్నాయి.

- సంతోష్‌కుమార్‌ గుప్తా, శ్రీ మణికంఠ ప్రింటర్స్‌, షాబాద్‌

ముందే బుకింగ్‌ చేసుకుంటున్నాం

ఈఏడాది పిబ్రవరి 11 నుంచి వివాహాలు ఉండటంతో ముందే గార్డన్‌ను బుక్‌ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మా గార్జెన్‌కు డిమాండ్‌ పెరిగింది. వదూవరూలకు తగ్గట్టుగా పంత్ర్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాము. వివిధ రకాల పూలతో డెకరేషన్‌, ఆలంకరణ అందుబాటులో ఉంచటం జరిగింది. వంట చేసే మాస్టర్‌ కూడ అందుబాటులో ఉన్నారు.

- దేవులపల్లి రాకేష్‌గౌడ్‌, రాజ్‌ఠాగూర్‌ గార్డెన్‌ మేనేజర్‌, హిమయత్‌నగ

Updated Date - Feb 08 , 2024 | 12:23 AM