Share News

బైపాస్‌ రోడ్డు మంజూరుకు కృషి చేస్తాం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:16 PM

జడ్చర్ల పట్టణంలోని ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు బైౖపాస్‌ రోడ్డు ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్‌రెడ్డి అన్నారు.

బైపాస్‌ రోడ్డు మంజూరుకు కృషి చేస్తాం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి

- సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి పెద్ద మొత్తంలో నిధులు తెస్తాం

- ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

మిడ్జిల్‌, ఏప్రిల్‌ 25 : జడ్చర్ల పట్టణంలోని ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు బైౖపాస్‌ రోడ్డు ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బోయిన్‌పల్లి గ్రామంలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో పెద్ద మొత్తంలో నిధులు మంజూరైన నియోజకవర్గంలో జడ్చర్ల మూడో స్థానంలో ఉందని తెలిపారు. జకినాలపల్లి తుర్కచెరువుకు రూ.11కోట్లు ఎన్నికల తర్వాత మంజూరు చేయిస్తానని పేర్కొన్నారు. కొత్తూరు, వెలుగొమ్ముల, అయ్యవారిపల్లి, చిలువేరు, రెడ్డిగూడ వరకు సెంట్రల్‌, స్టేట్‌ ఫండ్స్‌ ద్వారా డబుల్‌రోడ్డు కోసం నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇసుకను తానే సీజ్‌ చేయించానని, డంపులు తరలిస్తుంటే నిలిపివేయింనట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రతీ పేదవారికి తాను అండగా ఉంటానని, అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి మున్ముందు పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి, అన్ని రంగాలలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు అల్వాల్‌రెడ్డి, ఎంపీటీసీ గౌస్‌, నాయకులు శివకుమార్‌బాద్మీ, నిఖిల్‌రెడ్డి, అబ్దుల్‌ సమి, ప్రశాంత్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, చల్మారెడ్డి, వెంకటయ్య, మల్లికార్జున్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సత్యంగుప్తా, రాముగౌడ్‌, ధర్మేందర్‌రెడ్డి, నర్సిరెడ్డి, సత్యనారాయణ్‌రెడ్డి, సర్దార్‌, పర్వత్‌రెడ్డి, జహీర్‌, హరిప్రసాద్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:16 PM