Share News

దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:14 AM

నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి రఘువీర్‌ రెడ్డిని దేశంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం
సభలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ, ఏప్రిల్‌ 18 : నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి రఘువీర్‌ రెడ్డిని దేశంలో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఎన్నికల ప్రచార ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. 30 ఏళ్ల నుంచి కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో తాను, పద్మావతిరెడ్డి నిస్వార్థంగా సేవ చేస్తున్నట్లు తెలిపారు. తన సేవలతో ఇక్కడి ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజల మనస్సును చూరగొన్నానని తెలిపారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి, తనను 50 వేల పైగా మెజార్టీ ఇచ్చి ప్రజలు దీవించారన్నారు. రాష్ట్రంలోనే కోదాడను ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్ది ప్రజలకు కానుకగా ఇస్తానని హామీ ఇచ్చారు. ఇండియా కూటమికి సీపీఐ, సీపీఎంలు మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. విద్యార్థి సంఘాలు, మేధావులు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలన్నారు. విభజించు, పాలించుసూత్రాన్ని అమలుచేస్తున్న బీజేపీని చిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఒక్క ధాన్యం గింజ కూడా ఎంఎ్‌సపీ కన్నా తక్కువ ధరకు విక్రయించాల్సిన అవసరం రైతులకు లేదన్నారు. ఎవరైనా తక్కువ ధరకు తీసుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో మరమ్మతులు లేక నిలిచిన ఎత్తిపోతల పథకాలను అందుబాటులోకి తెచ్చి ప్రతీ ఎకరాకు నీరందిస్తామన్నారు. రూ.8 కోట్లతో ఆర్‌అండ్‌బీ అతిథిగృహాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. కోదాడలో అండర్‌ డ్రైనేజీ నిర్మాణానికి రూ.230 కోట్లు కేంద్రం మంజూరు చేసిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం అభివృద్ధి పథకాలను వేగవంతం చేస్తామన్నారు. జిల్లా సమస్యల సాధనకు, నిధుల మంజూరుకు రఘువీరారెడ్డిని గెలిపించాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. దేశంలోనే రావి నారాయణరెడ్డి తరహాలో రఘువీర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించనున్నట్లు తెలిపారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీలను ఓడించాలి : ఎమ్మెల్యే పద్మావతి

పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీలను ఓడించాలని, కాంగ్రె్‌సను గెలిపించాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. అభివృద్ధే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌ పనిచేస్తోందని, ఆ దిశగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందన్నారు. ఎంపీగా ఉత్తమ్‌గా ఉన్నప్పుడు బీఆర్‌ఎస్‌ కోదాడ నియోజకవర్గానికి నిధులు ఇవ్వకపోయినా ఆయన నీరు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కాంగ్రె్‌సతోనే నెలకొంటుందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిపించి, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే దిశగా, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. రఘువీరారెడ్డిని గెలిపించుకుంటే అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

రైల్వేలైన్‌ ఏర్పాటుకు, హైవే విస్తరణకు కృషి చేస్తా: రఘువీరారెడ్డి

ఎంపీగా గెలిపిస్తే హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారి విస్తరణతో పాటు అదే మార్గంలో రైల్వేలేన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని నల్లగొండ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. ఎంపీగా గెలిపిస్తే జిల్లాలోని అన్ని పథకాలను అమలు చేయటమే కాక ప్రాజెక్టులను పూర్తి చేసి, గత బీఆర్‌ఎస్‌ పాలనలో వెనుకబడిన ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేస్తానన్నారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు తమ హయాంలో ఏంచేశారో చెప్పకుండా ఓట్లు అడుగుతున్నారని, హామీలు అమలు చేయని వారికి ఓటు వేయవద్దన్నారు. రాష్ర్టాన్ని, దేశాన్ని విధ్వంసం చేస్తున్న ఆ పార్టీలకు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

సుస్థిర పాలన కాంగ్రె్‌సతోనే సాధ్యం ః మాజీ మంత్రి జానారెడ్డి

దేశంలో సుస్థిరపాలన, సుపరిపాలన కాంగ్రె్‌సతోనే సాధ్యమని సీఎల్పీ మాజీ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎవరినీ భయపెట్టిన దాఖలాలు లేవన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రతి ఒక్కరినీ భయపెట్టిన సందర్భాలే ఉన్నాయని ఆరోపించారు. 2023లో క్రాప్‌ హాలిడే ప్రకటించి కరువు తెచ్చిన బీఆర్‌ఎస్‌ దానిని కాంగ్రెస్‌పై నెట్టటం ఎంతవరకు సరైందన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో నాలుగేళ్లు ఖరీఫ్‌, రెండు ఏళ్లు రబీలో కరువు నెలకొందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడు నెలలే అయిందని, ఈ 100 రోజుల పాలనలో కరువు నెలకొందని బీఆర్‌ఎస్‌ చెప్పటం సిగ్గు చేటు కాదా అన్నారు. బీజేపీ ఆగడాలను అరికట్టాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ఈడీ ప్రయోగించి, విపక్షాలను భయపెడుతున్న బీజేపీకి పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. సమావేశంలో సాగర్‌ ఎమ్మెల్యే జయవీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, ముత్తవరపు పాండురంగారావు, ఎర్నేని బాబు, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, మహబూబ్‌ జాని, సామినేని ప్రమీల, అల్తాఫ్‌ హుస్సేన్‌, గన్నా చంద్రశేఖర్‌, మేకల శ్రీనివా్‌సరెడ్డి, వెంకట్‌రెడ్డి, వంగవీటి రామారావు, సామినేని ప్రమీల, నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:15 AM