Share News

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

ABN , Publish Date - May 15 , 2024 | 11:50 PM

ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని దేవరకొండ ఆర్టీసీ డీఎం రాజీవ్‌ ప్రేమ్‌కుమార్‌ అన్నారు.

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం
పైప్‌లైన లీకేజీని పరిశీలిస్తున్న ఆర్టీసీ డీఎం రాజీవ్‌ ప్రేమ్‌సాగర్‌

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం

దేవరకొండ ఆర్టీసీ డీఎం రాజీవ్‌ప్రేమ్‌కుమార్‌

కొండమల్లేపల్లి, మే 15: ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని దేవరకొండ ఆర్టీసీ డీఎం రాజీవ్‌ ప్రేమ్‌కుమార్‌ అన్నారు. కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో మరుగుదొడ్డి పైప్‌లైన లీకేజీ కావడంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆంధ్రజ్యోతి దినపత్రికలో బుధవారం ‘‘కంపుకొడుతోంది’’ అనే శీర్షికన ప్రచురించిన కథనానికి ఆర్టీసీ అధికారులు స్పందించారు. బుధవారం కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండును ఆర్టీసీ డీఎం రాజీవ్‌ప్రేమ్‌కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్టాండు లో రద్దీ బాగా పెరిగిందని తెలిపారు. అప్పట్లో ఏర్పాటు చేసిన మరుగుదొడ్డి పైప్‌లైన చిన్నవి కావడంతో పైపుల్లో చెత్తా చెదారం చేరి లీకేజీ అవుతుందని పేర్కొన్నారు. దీంతో దుర్వాసన వస్తుందని తెలిపారు. కొండమల్లేపల్లి ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాగునీరు, వసతి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో మాట్లాడి మిషన భగీరథ నీరు ప్రయాణికులకు అందే విధంగా చర్యలు చేపడుతామని అన్నారు. మరుగుదొడ్డి పైప్‌లైన లీకేజీ కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట ఆర్టీసీ సీఐ సైదులు, ఆర్‌ఎ్‌స.రావు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 15 , 2024 | 11:50 PM