ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తాం
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:56 PM
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శనివారం మోమిన్‌పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
మోమిన్‌పేట్, ఆగస్టు 24: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శనివారం మోమిన్‌పేట్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 31 మందికి కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, 45 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. త్వరలోనే ఇచ్చిన హామీ మేరకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలోని నందివాగు ప్రాజెక్టు, కొమిశెట్టిపల్లి ప్రాజెక్టు, కోట్‌పల్లి ప్రాజెక్టు, సర్పన్‌పల్లి ప్రాజెక్టులకు అత్యధిక నిధులు కేటాయించి మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మనోహరచక్రవర్తి, డిప్యూటీ తహసీల్దార్ సురేశ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మన్నె శంకర్‌యాదవ్, జిల్లా నాయకులు నరోత్తంరెడ్డి, సుభా్‌షగౌడ్, మానయ్య, మహేందర్‌రెడ్డి, వేమారెడ్డి, ప్రతా్‌పరెడ్డి, సురేందర్, మహంతు స్వామి, గిరిసింగ్, నర్సిములు, పడాల బాబు, వేమారెడ్డి, రామకృష్ణారెడ్డి, మల్‌రెడ్డి, మహేందర్, శ్రీనివా్‌సరెడ్డి, ఏజాజ్ పటేల్, ఏరాజ్‌పాష, సుభాష్, బాల్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, కృష్ణ పాల్గొన్నారు.