మెగా డీఎస్సీతో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం
ABN , Publish Date - Jun 12 , 2024 | 10:36 PM
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణంయించిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 11 ఏళ్లుగా డీఎస్సీ నోటిపికేషన్ ఇవ్వకుండా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ తెలిపారు. మండల పరిధిలోని కేరెల్లి గ్రామంలో బుధవారం జడ్పీ చైర్‌పర్సన్ పి.సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన పాఠశాల విద్యార్థులకు దుస్తులు, పాఠ్య, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసింది.
స్పీకర్ ప్రసాద్‌కుమార్
ధారూరు/మోమిన్‌పేట్, జూన్ 12: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణంయించిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 11 ఏళ్లుగా డీఎస్సీ నోటిపికేషన్ ఇవ్వకుండా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ తెలిపారు. మండల పరిధిలోని కేరెల్లి గ్రామంలో బుధవారం జడ్పీ చైర్‌పర్సన్ పి.సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి ఆయన పాఠశాల విద్యార్థులకు దుస్తులు, పాఠ్య, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి పల్లెలో పేదలకు విద్య, వైద్యం పూర్తిస్థాయిలో అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది విద్యార్థులకు దుస్తులు, పాఠ్య, నోట్ పుస్తకాలు అందజేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని, విద్యార్థులు చదువులో రాణించాలని కోరారు. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు సాధించకుంటే జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎంకు, తనకు, జిల్లా కలెక్టర్‌కు, తల్లిదండ్రులకు చెడ్డపేరు వస్తుందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధ్ది చేయాలని స్వచ్చంద సంస్థలు, కార్పోరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలను కోరానని, లయన్స్ క్లబ్ వారు ధారూరు, కేరెల్లి పాఠశాలలో రూ.10లక్షలతో మరుగుదొడ్లను నిర్మిస్తున్నారన్నారు.గత ప్రభుత్వం అమలు చేసిన 317 జీవో పై ప్రభుత్వ సబ్ కమీటి వేసిందని, ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ పి.సునీతా మహేందర్ రెడ్డి, రాష్ట్ర పాఠశాలల అభివృద్ది అధికారి(ఎస్పీడీ) మల్లయ్య భట్టు, కలెక్టర్ నారాయణరెడ్డి, డీఈవో రేణుకాదేవి, ఎంపీపీ విజయలక్ష్మి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పి.రఘువీరారెడ్డి, కాంగ్రె్‌సపార్టీ మండలాధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి, రాములు, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించినట్లు ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. బుధవారం మోమిన్‌పేట్ మండల కేంద్రంలో ఎంపీ, స్పీకర్, జడ్పీ చైర్ పర్సన్ సునీతామహేందర్‌రెడ్డిలు కలిసి నూతన ప్రభుత్వాసుపత్రి భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రూ. 1.56కోట్లతో నిర్మించిన ఆసుపత్రిలో అన్నీ రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ విజయ్‌కుమార్, ఎంపీపీ వసంత వెంకట్, కలెక్టర్ నారాయణరెడ్డి, డీఎంహెచ్‌వో పాల్వన్‌కుమార్, ఆర్డీవో వాసుచంద్ర, జిల్లా పరిషత్ సీఈవో సుధీర్, మండల అభివృద్ధి అధికారి, తహసీల్దార్ మనోహచ చక్రవర్తి, వైద్యులు సుజల, ఏఈ ప్రణిత్, శంకర్‌యాదవ్, లక్ష్మారెడ్డి, నరోత్తంరెడ్డి, సుభా్‌షగౌడ్, సిరాజుద్దీన్, మానెయ్య, శ్రీనివాస్, శ్రీనివా్‌సరెడ్డి, మహేందర్‌రెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.